Horoscope Today June 3 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి అకస్మిక ధన లాభం!
Daily Astrological prediction for June 3 2022. కన్య, ధనుస్సు మరియు కుంభ రాశుల వారికి శుభకాలం నడుస్తోంది. అంతేకాదు ఈ మూడు రాశుల వారికి అకస్మిక ధన లాభం ఉంది.
Today Horoscope June 3 2022: మేషం ( Aries): చేపట్టిన పనిలో విజయాన్ని సాధిస్తారు. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. కీలక పనులు మధ్యాహ్నంలోపు చేసుకోవడం మంచిది. దుర్గామాత దర్శనం శుభప్రదం.
వృషభం (Taurus): శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. దూర బంధువులతో ఆనందంగా గడుపుతారు. ప్రారంభించిన పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఫలితాన్ని సాధిస్తారు. విదేశయాన ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంది. నవగ్రహ స్తోత్రం చదివితే మంచిది.
మిథునం (Gemini): కొత్త పనులు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశముంది. ముఖ్య విషయాలను మధ్యాహ్నం లోపు పూర్తిచేయండి. బంధు, మిత్రులతో కలహాలేర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. హనుమాన్ చాలీసా చదవండి.
కర్కాటకం (Cancer): కీలక విషయాలలో అనుకున్న ఫలితాలు వస్తాయి. మానసిక ఆనందం లభిస్తుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. అఆరోజిగం పట్ల నిర్లక్ష్యం వద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే బాగుంటుంది.
సింహం (Leo): కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి. విదేశయాన ప్రయత్నాలకు అనుకూల సమయం. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. స్థానచలనమేర్పడే అవకాశాలుంటాయి. రుణలాభం పొందుతారు. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర చదవాలి.
కన్య (Virgo): మీ ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవండి.
తుల (Libra): మంచి ఫలితాలను రాబట్టడానికి సరైన సమయం నడుస్తోంది. విదేశయాన ప్రయత్నం సులభంగా మారుతుంది. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆకస్మిక ధన నష్టమేర్పడే అవకాశముంది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇష్టదేవతా స్తోత్రం చదవడం మంచిది.
వృశ్చికం (Scorpio): మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించండి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ధన వ్యయం ఉంది. సమయానికి తగిన విశ్రాంతి అవసరం. శ్రీరామ నామాన్ని జపించాలి.
ధనస్సు (Sagittarius): అకస్మిక ధన లాభం ఉంది. వస్తు, నగలు కొనుగోలు చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తారు. మానసికానందం పొందుతారు. ప్రయాణాలు చేస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.
మకరం (Capricorn): బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. దత్తాత్రేయస్వామి ఆరాధన శుభ ఫలితాన్ని ఇస్తుంది.
కుంభం (Aquarius): అన్ని రంగాల వారికి అసానుకూల సమయం. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త. ఒక మంచి అవకాశాన్ని కోల్పోతారు. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. అకస్మిక ధన లాభం ఉంది. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. శివారాధన వల్ల శుభ ఫలితాలు ఉన్నాయి.
మీనం (Pisces): కీల పనుల్లో బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధన నష్టమేర్పడే అవకాశముంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్త. మానసిక ప్రశాంతత కోసం దైవచింతన అవసరం అవుతుంది. సూర్య ఆరాధన మంచిది.
Also Read: RRR Trolls: ఆర్ఆర్ఆర్ విజయం చూసి కుళ్ళుకుంటున్న అక్కడి ఫాన్స్.. 'గే చిత్రం' అంటూ ట్రోల్స్!
Also Read: Sara Ali Khan Bikini: అయ్య బాబోయ్.. బికినీలో సారా అలీ ఖాన్ మాములుగా లేదుగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook