Guru Pushya Yoga 2024: ఈరోజు 2024 జనవరి 25 పుష్య పూర్ణిమ గురు పుష్య యోగంతో కలిసి వస్తోంది. హిందూమతంలో పూర్ణిమ తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జనవరి 25న రోజంతా సర్వార్థ సిద్ధి యోగం జరుగుతుంది. జనవరి 26న ఉదయం 08:16 నుంచి 07:12 వరకు గురు-పుష్య, అమృత సిద్ధి యోగం ఉంటుంది. జ్యోతిషశాస్త్రంలో ఈ యోగ చాలా పవిత్రమైందిగా పరిగణిస్తారు. ఇది కాకుండా ఈరోజు అనేక ఇతర యాదృచ్ఛికాలు జరుగుతాయి. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ యోగం ఏర్పడుతుంది.  జ్యోతిషశాస్త్రంలో ఈ రకమైన యోగా చాలా పవిత్రమైంది. అంతేకాదు,ఈ శుభ యోగంలో విష్ణువు, లక్ష్మీదేవిని, చంద్రుడిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఈరోజు ఇంటికి ఏ వస్తువులు తెచ్చుకోవాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వస్తువులు ఇంటికి తీసుకువస్తే శ్రేయస్కరం..


పప్పులు..
జనవరి 25 న గురు-పుష్య యోగం సమయంలో ఇంటికి పప్పును కొనుగోలు చేయండి. కందులు బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. అంతే కాదు మీ జన్మ కుండలిలో బృహస్పతి బలంగా ఉండడంతో పాటు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు మీపై ఉంటాయి. వ్యాపార రంగం, విద్యలో కూడా మీరు దూసుకుపోతారు.


వెండి, బంగారం..
ఈరోజు బంగారం లేదా వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం చాలా శుభప్రదం. ఈ యోగ సమయంలో వెండి బంగారం కొనుగోలు చేస్తే, భవిష్యత్తులో అనేక రెట్లు పెరుగుతుంది. అంతేకాదు మీపై లక్ష్మీ దేవి ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది. ఈ యోగా సమయంలో కొనుగోలు చేయడం వల్ల రెట్టింపు ఫలితాలు పొందుతారు..


Also read: Shani Dev: ఏలినాటి శని తొలగిపోవాలంటే ఈ చిన్నపరిహారం చేయండి.. శనిభగవాణుడు ప్రసన్నమైపోతాడట..!


పూజా సామగ్రి..
ఈ పూర్ణిమ రోజున పూజకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తే కూడా చాలా శుభప్రదం. ఈ రోజున మీరు మీ పూజగదికి కావాల్సిన దేవుని విగ్రహం లేదా మతపరమైన పుస్తకాన్ని కొనుగోలు చేయవచ్చు. ఈరోజు శుభయోగం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.


 భూమి, వాహనం.. 
ఈ గురు-పుష్య సంయోగ శుభ యోగ సమయంలో మీరు వాహనాలు, ఇళ్లు, భూమి కొనుగోలు చేయడం చాలా శుభప్రదం. దీనివల్ల మీరు భవిష్యత్తులో రెట్టింపు లాభాలను పొందుతారు. మొత్తానికి పుష్యపౌర్ణమి, గురుపుష్యయోగం, అమృతసిద్ధి ఇతర యోగాల వల్ల ఈ వస్తువులను కొనుగోలు చేస్తే రెట్టింపు సంపద భవిష్యత్తులో మీసొంతం అవుతుందట.


Also read: Today Rasi Phalalu: సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండండి.. పెట్టుబడి ప్రణాళికను ప్రారంభించండి.. మీ రోజు ఎలా ఉందో తెలుసుకోండి..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook