Today's Horoscope January 22 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారికి పూర్తి అనుకూల సమయం. కొన్ని రాశుల వారికి అన్ని మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. అనవసర వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే మానసిక ప్రశాంతత చేకూరుతుంది.  అమృత ఘడియలు రా.2.22 నుంచి 3.58 వరకు ఉన్నాయి. దుర్ముహూర్తం ఉ. 6.38 నుంచి 8.06 వరకు ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Aries - మేషం: అన్ని రంగాల వారికి లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. చిత్తశుద్ధితో చేసే పనులు లాభాన్ని ఇస్తాయి. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల అంగీకారం తప్పనిసరి. కుటుంబంతో సరదాగా గడుపుతారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మంచిది.


Taurus - వృషభం: బలమైన సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పని చేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త. విష్ణు నామస్మరణ శక్తిని ఇస్తుంది.


Gemini - మిథునం: అన్ని రంగాలలో శుభకాలం నడుస్తోంది. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది.


Cancer - కర్కాటకం: ముఖ్యమైన వ్యవహారాల్లో పట్టుదల అవసరం. ఒత్తిడికి లోనవకుండా ఓర్పుగా వ్యవహరించండి. వ్యాపారం విషయంలో ఎదుటివారి ఆలోచనలు తీసుకోవడం మంచిది. శ్రీవేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది.


Leo - సింహం: మంచి పనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. స్థిర నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. గోవింద నామాలు చదవడం మంచిది.


Also Read: IND vs SA : స‌ఫారీల‌దే వ‌న్డే సిరీస్‌.. రెండో వన్డేలోనూ భారత్ ఓటమి


Virgo - కన్య: మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. మీకు అనుకూలంగా ఏదీ ఉండకపోవచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. గణపతి దర్శనం శుభప్రదం.


Libra - తుల: శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. శుభ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో గడుపుతారు. గోసేవ చేస్తే బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే మంచిది.


Scorpio - వృశ్చికం : అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. ఆవేశాలకు పోకూడదు. ప్రయాణాల్లో అశ్రద్ద వద్దు. గోవిందనామాలు చదవడం వల్ల పనులలో విజయంతో పాటు మంచి జరుగుతుంది.


Sagittarius - ధనుస్సు: కొన్ని విషయాలలో మీరు అనుకున్న దాని కన్నా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యం, మనోవిచారం. మీకు ప్రతికూల సమయం నడుస్తోంది. అనుకున్న పనులు జరగకపోవచ్చు. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచిది.


Also Read: Samantha enjoys skiing : మంచుకొండల్లో సమంతా స్కీయింగ్, అది అంత సులభంకాదంటూనే..


Capricorn - మకరం: మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. విందూవినోదాల్లో పాల్గొంటారు. బంధుప్రీతి కలదు. ఇష్టదైవ నామస్మరణ శుభకరం.


Aquarius - కుంభం: ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. శారీరక శ్రమ పెరుగుతుంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. గొడవలకు పోరాదు. చంద్ర శ్లోకం చదవాలి.


Pisces - మీనం: కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. డబ్బు విషయంలో పొదుపు పాటించాలి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. శివనామాన్ని జపించాలి.


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook