Todays Horoscope: గ్రహాల కదలికలు, రాశుల్ని బట్టి వ్యక్తుల దిన ఫలాలు ఉంటాయి. మనలో చాలామందికి రోజు ప్రారంభించేముందు ఆ రోజు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఏయే రాశుల వారికి ఏ రోజు బాగుంటుందనేది ఇప్పుడు పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనలో మనకు తెలియకుండానే చాలామందిలో జ్యోతిష్యం ఓ భాగంగా మారిపోయుంటుంది. కొంతమంది నమ్మవచ్చు. మరి కొద్దిమంది నమ్మకపోవచ్చు. కానీ మెజార్టీ జ్యోతిష్యాన్ని నమ్ముతుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎలా ఉంటాయి, విద్యార్ధులైతే చదువు గురించి, కెరీర్ గురించి , వ్యాపారాల గురించి, కుటుంబ వ్యవహారాల గురించి ఇలా ప్రతి ఒక్క అంశం గురించి తెలుసుకుంటారు. ఏ రోజు ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రతి నెలా శనివారం నాడు ఏయే రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏయే పనులు చేపట్టవచ్చు, ఏవి చేయకూడదనేది ఇప్పుడు చూద్దాం.


మేష రాశి : ఈ రాశిలో పుట్టినవారికి ఇవాళ ఆర్ధికంగా బాగుంటుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే ఫరవాలేదు. ఇంట్లో కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి సమస్య ఎదురుకాదు. ఈ రాశివారికి సాయంత్రం 4 గంటల 5 నిమిషాల్నించి రాత్రి 9 గంటల వరకూ సమయం అనుకూలం.


వృషభరాశి : ఉద్యోగస్థులకు ఇవాళ మంచిరోజు. పదోన్నతి కలగవచ్చు. ఇంట్లో కుటుంబసభ్యులతో బాగానే ఉంటుంది. అయితే మీ వైఖరి బాగుండేట్టు చూసుకోండి. వ్యాపారులకు అప్రమత్తత అవసరం. లేకపోతే నష్టాలు రావచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కాస్త సమస్య ఉంటుంది. ఆర్ధికంగా ఏ సమస్యా ఉండదు . ఈ రాశివారికి సాయంత్రం 6 గంటల 15 నిమిషాల్నించి రాత్రి 9 గంటల వరకూ బాగుటుంది. 


మిధున రాశి : ఈ రాశిలో పుట్టినవారికి అనుకూలమైన పరిస్థితులున్నాయి. ఉద్యోగస్థులు, వ్యాపారులకు పరిస్థితి బాగుంటుంది. వ్యాపారులకు మాత్రం అప్రమత్తత అవసరం. కుటుంబంలో శాంతి ఉంటుంది. ఉద్యోగస్థులు మంచి ఫలితాల్ని పొందే అవకాశాలున్నాయి. ఈ రాశివారికి మద్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ బాగుంటుంది.


కర్కాటక రాశి :  ఈ రాశివారికి ఆర్ధికంగా బాగుంటుంది. సమస్యలు తొలగి..ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనులన్నింటిని సకాలంలో పూర్తి చేయలరు. ఉద్యోగులకు ఇవాళ బాగుంటుంది. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. ఈ రాశివారికి మద్యాహ్నం 12 గంటల్నించి రాత్రి 8 గంటల వరకూ మంచి సమయం.


సింహ రాశి : ఆరోగ్య పరంగా బాగుంటుంది కానీ ఆర్ధికంగా కాస్త ఇబ్బందే. ఎందుకంటే ఆశించిన లాభాలుండవు. అయితే ఉద్యోగస్థులు మాత్రం అనుకున్న పనులన్నింటినీ పూర్తి చేస్తారు. కుటుంబసభ్యులతో మంచి వాతావరణం ఉంటుంది. ఉదయం 7 గంటల 45 నిమిషాల్నించి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకూ మంచి సమయం.


కన్య రాశి : ఆర్దికంగా, ఆరోగ్యపరంగా రెండింటిలోనూ ఇబ్బంది కల్గించే పరిణామాలుంటాయి. ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురవుతాయి. ఆర్దికంగా ప్రతికూల పరిస్థితులుంటాయి. రుణమిచ్చినవారి ఒత్తిడి ఎక్కువవుతుంది. వ్యాపారులకు ఇవాళ సాధారణంగానే ఉండవచ్చు. ఆరోగ్యపర సమస్యలపై మంచి వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. మద్యాహ్నం 2 గంటల్నించి సాయంత్రం 4 గంటల వరకూ మంచి సమయం.


తుల రాశి : ఆరోగ్యపరంగా బాగుంటుంది. కానీ ఆర్ధికంగా అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో మంచి అనువైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్థులు తోటివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. సాయంత్రం 4 గంటల 45 నిమిషాల్నించి రాత్రి 8 గంటల వరకూ మంచి అనువైన సమయం.


వృశ్చిక రాశి : ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలుంటాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారులైతే కొన్ని సమస్యల్నించి గట్టెక్కవచ్చు. కుటుంబసభ్యులతో అనువైన పరిస్థితులుంటాయి. సాయంత్రం 6 గంటల్నించి రాత్రి 8 గంటల 45 నిమిషాలవరకూ బాగుంటుంది. 


ధనస్సు రాశి : ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురుకావచ్చు ఆర్ధికంగా ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా చిక్కుల్లో పడవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్థుల పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబసభ్యులతో బాగుంటుంది. మద్యాహ్నం 12 గంటల 30 నిమిషాల్నించి రాత్రి 7 గంటల 55 నిమిషాల వరకూ అనుకూలం.


మకర రాశి : ఆర్ధిక సమస్యలన్నీ దూరమౌతాయి. ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలుంటాయి. ఎక్కువగా కష్టపడటంతో మానసిక ఒత్తిడికి లోనవుతారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఉద్యోగ, వ్యాపారస్థులకు పూర్తిగా అనుకూలమైంది. మద్యాహ్నం 3 గంటల్నించి రాత్రి 8 గంటల 20 నిమిషాలవరకూ మంచి సమయం.


కుంభ రాశి : కుటుంబసభ్యులతో మీ సంబంధాలు బాగుంటాయి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఉద్యోగస్థులకు మంచి అనువైన పరిస్థితులుంటాయి. వ్యాపారులు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల్నించి మద్యాహ్నం 2 గంటల వరకూ అనువైన సమయం.


మీన రాశి : ఈ రాశిలో పుట్టినవారికిక ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బంది కలుగుతుంది. ఆర్ధికంగా బాగుంటుంది. అయితే వ్యాపారులు మాత్రం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, కష్టపడటం చేయాల్సి ఉంటుంది. కుటుంబజీవితంలో సానుకూల పరిణామాలుంటాయి. ఉదయం 9 గంటల్నించి సాయంత్రం 6 గంటల వరకూ బాగుంటుంది.


Also read: Angry Zodiac Signs: శత్రుత్వంలో ఈ రాశులకు సాటి లేరు ఎవ్వరూ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి