Trigrahi Yog in February 2024: కర్మఫల దాత అయిన శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో 30 ఏళ్ల తర్వాత సంచరిస్తున్నాడు. ఫిబ్రవరి నెలలో శుక్రుడు, బుధుడు కూడా అదే రాశిలోకి ప్రవేశించబోతున్నారు. కుంభరాశిలో శని, బుధ, శుక్ర గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతోందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇలా జరగడం 50 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఈ త్రిగ్రాహి యోగం వల్ల మూడు రాశులవారి సంపద విపరీతంగా పెరగబోతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభం: ఇదే రాశిలో త్రిగ్రాహి యోగం సంభవించబోతుంది. దీంతో మీరు చేపట్టిన ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీరు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. మీ కెరీర్ బాగుంటుంది. మీకు కోరుకున్న జాబ్ వస్తుంది. 
వృషభం: త్రిగ్రాహి యోగం వృషభ రాశి వారికి మేలు చేస్తుంది. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. మీ ఆర్థిక స్థితి పటిష్టంగా ఉంటుంది. మీరు చేసే వ్యాపారంపై ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది. మీకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్టు లభిస్తుంది. మీరు పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 


Also Read: Rasi Phalalu: ఈ రాశులవారిపై చతుర్గ్రాహి యోగం ఎఫెక్ట్‌..ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి!


మిథునం: మిథున రాశి వారికి త్రిగ్రాహి యోగం అద్భుతంగా ఉండబోతోంది. మిమ్మల్ని ప్రతి పనిలో అదృష్టం వరిస్తుంది. మీకు దైవభక్తి పెరుగుతుంది. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీ కీర్తి నలు దిక్కులా వ్యాపి చెందుతుంది. ఫారిన్ కు వెళ్లాలనే వారి డ్రీమ్ నెరవేరుతోంది. 
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Mercury Set 2024 effect: ఈ నెల రోజులు ఈ 3 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి... లేకపోతే అంతే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter