Mercury Set 2024 effect: ఈ నెల రోజులు ఈ 3 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి... లేకపోతే అంతే!

Mercury Set 2024 effect: గ్రహాల రాకుమారుడైన బుధుడు మరో వారం రోజుల్లో అస్తమించబోతున్నాడు. దీని కారణంగా నెల రోజులపాటు మూడు రాశులవారు ఇబ్బందులు పడనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2024, 11:57 AM IST
Mercury Set 2024 effect: ఈ నెల రోజులు ఈ 3 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి... లేకపోతే అంతే!

Budh Asta in February 2024: తెలివితేటలు మరియు స్కిల్స్ కు కారకుడైన బుధుడు గురువారం (ఫిబ్రవరి 1)న మకరరాశి ప్రవేశం చేశాడు. ఫిబ్రవరి 08న ఇదే రాశిలో మెర్క్యూరీ అస్తమించబోతున్నాడు. మార్చి 11 వరకు ఇదే స్థితిలో ఉండబోతున్నాడు.  సాధారణంగా గ్రహాల అస్తమయం చెడు ఫలితాలను ఇస్తుంది. బుధుడు అస్తమయం మూడు రాశులవారికి ప్రతికూల ఫలితాలను ఇవ్వబోతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

మిథునం: 
అస్తమించిన బుధుడు మిథున రాశి వారికి అనేక ఇబ్బందులను కలిగిస్తుంది. మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మీ కుటుంబంలో విభేదాలు వస్తాయి. వ్యాపారస్తులు  నష్టపోయే అవకాశం ఉంది. మీకు సహోద్యోగులతో వివాదాలు రావచ్చు. ఉద్యోగస్తులకు ఈ సమయం అస్సలు కలిసిరాదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 
మేషరాశి: 
బుధుడు అస్తమించడం మేషరాశి వారికి అశుభకరంగా ఉండబోతోంది. మీరు చేపట్టిన పనులన్నీ ఆలస్యమవుతాయి. మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా నష్టపోతారు. ఉద్యోగానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకోండి. మీరు మీ సహచరులను వివాహం చేసుకునే అవకాశం ఉంది. 

Also Read: Rasi Phalalu: ఈ రాశులవారిపై చతుర్గ్రాహి యోగం ఎఫెక్ట్‌..ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి!

సింహం: 
బుధుడు కదలికలో మార్పు వల్ల సింహరాశి వారు భారీగా నష్టాలను చవిచూస్తారు. ఈ సమయంలో ఎందులోనైనా పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త ఆలోచించండి. పని చేసే చోట జాగ్రత్తగా ఉండండి. మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. మీ కుటుంబంలో గొడవలు వస్తాయి. మీరు మోసపోతారు. మీరు చేసిన కష్టానికి మరొకరు లాభపడతారు. 

Also Read: Astrology: మేషరాశిలో కలవబోతున్న గురుడు-శుక్రుడు... ఈ రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News