Tirgrahi Yog In Kumbh: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మార్చడం ద్వారా శుభ యోగాలను సృష్టిస్తాయి. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఫిబ్రవరిలో సూర్యుడు మరియు బుధుడు కూడా ఇదే రాశిలోకి ప్రవేశించనున్నారు. కుంభరాశిలో ఈ మూడు గ్రహాల కలయిక వల్ల అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈయోగం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

త్రిగ్రాహి యోగం ఈ రాశులకు శుభప్రదం
మకర రాశిచక్రం (Capricorn): త్రిగ్రాహి యోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి రెండవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. దీంతో మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. 
సింహ రాశి (Leo): త్రిగ్రాహి యోగం వల్ల సింహరాశి వారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. ఎందుకంటే మీ రాశి నుండి ఏడవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. ఈ సమయం ఉద్యోగస్తులకు ఎంతో మేలు చేస్తుంది. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో విజయం ఉంటుంది. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. 
వృషభ రాశి (Taurus): త్రిగ్రాహి యోగం మీ రాశి నుండి దశమ స్థానంలో ఏర్పడతుంది. దీంతో మీకు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగస్తుల ఇంక్రిమెంట్ మరియు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఆఫీసులో సహోద్యోగుల సపోర్టు లభిస్తుంది. మెుత్తానికి ఈ సమయం బాగుంటుంది. 


Also Read: Budh transit 2023: మకరంలో బుధ గోచారం.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook