Ugadi 2024 Rashi Phalalu: ఈ ఏడాది ఏప్రిల్ 09వ తేదీకి చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే ఇదే రోజు చైత్ర నవరాత్రులు, హిందూ నూతన సంవత్సరం ప్రారంభం కావడం వల్ల ఈ రోజుకు ప్రాధాన్యత పెరిగింది. ఆస్ట్రాలజీ పరంగా కూడా ఈరోజు చాలా ముఖ్యమైనది. గ్రహాలు ప్రిన్స్ అయిన బుధుడు ఇవాళ రాత్రి 9.30 గంటలకు మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే అదే రాశిలో గ్రహాల అధిపతి అయిన సూర్యుడు, ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు ఉన్నారు. మీనరాశిలో ఈ మూడు గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం రూపొందుతుంది. ఈ యోగం వల్ల మూడు రాశులవారు ప్రత్యేక బెనిఫిట్స్ పొందబోతున్నారు. ఆ రాశులు  ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మకరరాశి
త్రిగ్రాహి యోగం మీనరాశి వారికి శుభకరంగా ఉంటుంది. వీరు చేపట్టే ఏ కార్యమైనా విజయవంతం అవుతుంది. కెరీర్ ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య అపాయ్యత పెరుగుతుంది. పెళ్లికాని యువతీ యువకులకు వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. మీరు ఏ పని చేసినా దానికి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్టు ఉంటుంది. 
మిధునరాశి
మీనరాశిలో ఏర్పడబోతున్న మిథునరాశి వారికి భారీగా సంపదను ఇస్తుంది. మీరు ఎక్కడికి వెళ్లిన అక్కడ మీకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంటారు. మీ కెరీర్ లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు చేసిన పనికి మీ బాస్ నుంచి ప్రశంసలు వస్తాయి. పాలిటిక్స్ లో ఉన్నవారికి పదవి దక్కే అవకాశం ఉంది. మీ ఆదాయం మునుపటి కంటే భారీగా పెరుగుతుంది. వ్యాపారులు నాలుగు రెట్లు లాభాలను చూస్తారు. మీకు దైవభక్తి పెరుగుతుంది. 


కర్కాటక రాశి
ఉగాది నాడు కర్కాటక రాశి వారు శుభవార్తలు వింటారు. ఎంతో కాలంగా ట్రై చేస్తున్న జాబ్ వస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్ దక్కుతుంది. మీరు ఇంతకముందు ఎప్పుడూ చూడనంత డబ్బును మీ అకౌంట్ లో చూస్తారు.  కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీరు ఫ్యామిలీ అండ్ స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 
(Disclaimer:  ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Ugadi Panchangam - Krodhi: తులా నుంచి మీనం వరకు క్రోధీ నామ సంవత్సరంలో ఏ రాశి వారు ఎక్కువ ధన యోగం ఉందో తెలుసా.. ?


Also Read: Ugadi Panchangam: క్రోధీ నామ సంవత్సరంలో మేషం నుంచి కన్య వరకు ఏ రాశికి ఎక్కువ లక్కీ అంటే.. ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి