Ugadi Panchangam: క్రోధీ నామ సంవత్సరంలో మేషం నుంచి కన్య వరకు ఏ రాశికి ఎక్కువ లక్కీ అంటే.. ?

Ugadi  Panchangam - Krodhi: సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా అందరు ప్రజలు గ్రెగోరియన్ క్యాలెండర్‌ను అనుసరిస్తారు. కానీ తెలుగు ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని హిందువులకు  ఉగాది నుంచి కొత్త యేడాది ప్రారంభం అవుతోంది. ఉగాదికి కొత్త పంచాంగం ప్రకారం మేషం నుంచి కన్య వరకు ఎలా ఉందో చూద్దాం..

 

1 /6

మేష రాశి..   ఈ రాశి వారికి ఆదాయం 8.. వ్యయం..14.. రాజ్య పూజ్యం 4.. అవమానం.. 3 ఈ రాశి వారికి అదృష్ట యోగం 75 శాతం ఉంది. ఈ రాశి భాగ్య, వ్యయాధిపతి ధన స్థానంలో ఉన్నాడు. మరోవైపు శని దేవుడు 11వ ఇంట బలీయంగా ఉన్నాడు. రాహువు, కేతువు, వ్యయం, షష్ఠమము ఉండుట వలన మంచి ధనయోగ ప్రాప్తి ఉంటుంది. కెరీర్‌ పరుగులు పెడుతోంది.

2 /6

వృషభ రాశి..   ఈ రాశి వారికి ఆదాయం.. 2.. వ్యయం.. 8 రాజ్యపూజ్యం -7 అవమానం - 3 ఈ రాశి స్త్రీ పురుషులకు అష్టమ లాభాధిపతి ధనము, సంపద, కుటుంబానికి కారకుడైన గురుడు జన్మంలో ఉన్నాడు. శని రాజ్య స్థానంలో ఉండటం వలన ఈ రాశి వారికి పట్టిందల్ల బంగారమే అన్నట్టుగాఉంటుంది.

3 /6

మిథున రాశి.. ఈ రాశి వారికి ఆదాయం.. 5 వ్యయం. 5 రాజ్యపూజ్యం -3 అవమానం - 6 ఈ రాశి వారికి బుద్ది, ధనము, కుటుంబ కారకుడైన గురుడు బలీయంగా ఉన్నాడు. శని, రాహువు బలీయంగా ఉంటడం వలన ఈ రాశి వారికి అన్ని విధాల యోగంగా ఉంటుంది.

4 /6

కర్కాటక రాశి.. ఈ రాశి వారికి ఆదాయం.. 14, వ్యయం -2, రాజ్యపూజ్యం -6, అవమానం -6 ఈ రాశి స్త్రీ, పురుషులకు ధనము, విద్య, సంపద, బుద్ధి, సంతానముకు కారకుడైన గురుడు మంచి స్థానంలో ఉండటం వలన ఎలాంటి కష్టసాధ్యమైన పనులైనా అవలీలగా చేస్తారు. వ్యక్తిగతంగా, సాంఘికంగా గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి.

5 /6

సింహ రాశి.. ఈ రాశి వారికి ఆదాయం.. 2, వ్యయం -14, రాజ్యపూజ్యం -2, అవమానం -2 ఈ రాశి వారికి ధన, కుటుంబ కారకుడైన గురుడు పదవ రాశిలో ఉండటం.. మరోవైపు రాహువు అష్టమంలో ఉన్నందున జీవితం పోరాట మయంగా ఉంటుంది. మరోవైపు గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి కానీ వారికి ఈ యేడాది పెళ్లి పీఠలు ఎక్కుతారు.

6 /6

కన్య రాశి.. ఈ రాశి వారికి ఆదాయం.. 5, వ్యయం -5, రాజ్యపూజ్యం -5, అవమానం -2 ఈ రాశి స్త్రీ, పురుషులకు గురుడు భాగ్యస్థానం అందు సంచారం వలన శని ఆరింటిలో బలీయంగా ఉన్నాడు. ఈ రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలను అందుకుంటారు.