Ugadi Panchangam - Krodhi:ఉగాది నుంచి తెలుగు వారితో పాటు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతోంది. ఈ యేడాదిలో తులా రాశి నుంచి మీన రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి. ఏ రాశి వారికీ ధన యోగం ఉందో చూద్దాం..
తుల రాశి.. ఈ రాశి వారికి ఆదాయం.. 2, వ్యయం -8, రాజ్యపూజ్యం -1, అవమానం -5 ఈ రాశి స్త్రీ, పురుషాదులకు దైవ బలం అధికంగా ఉంటుంది. ధనం, కుటుంబం, సంపద, పుత్రులకు కారుకుడైన గురుడు 8వ ఇంట సంచారం లాభిస్తుంది. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతారు.
వృశ్చిక రాశి.. ఈ రాశి వారికి ఆదాయం.. 8, వ్యయం -14, రాజ్యపూజ్యం -4, అవమానం -5 ఈ రాశి స్త్రీ, పురుషులకు సంబంధించి ధన, కుటుంబానికి సంబంధించి గురుడు 7వ స్థానంలో సంచారం..రాహువు, కేతువు 5, 11 స్థానాల్లో సంచరించడం వలన అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు.
ధనుస్సు రాశి.. ఈ రాశి వారికి ఆదాయం.. 11, వ్యయం -5, రాజ్యపూజ్యం -7, అవమానం -5 ఈ రాశికి సంబంధించిన విషయానికొస్తే.. కుటుంబం, ధనస్సు, సంపదకు కారకుడైన గురుడు 6వ ఇంట..రాహువు, కేతువు 4 మరియు 10 స్థానాల్లో ఉన్నారు. శని స్థితి యోగించును. అన్ని రంగాల వారికీ అనుకూలంగా ఉంటుంది.
మకర రాశి.. ఈ రాశి వారికి ఆదాయం.. 14, వ్యయం -14, రాజ్యపూజ్యం -3, అవమానం -1 ఈ రాశి వారికి ఏల్నాటి శని ప్రభావం తగ్గును. ధనం, కుటుంబ కారకుడైన గురువు 5వ ఇంట.. లగ్నాధిపతి శని 2వ ఇంట బలీయంగా ఉండటం వలన జీవితం బలీయంగా ఉంటుంది.
కుంభ రాశి.. ఈ రాశి వారికి ఆదాయం.. 14, వ్యయం -14, రాజ్యపూజ్యం -6, అవమానం -1 ఏల్నాటి శని ప్రభావం వల్ల ఆరోగ్య భంగములు.. మానసిక అశాంతి నెలకొంటుంది. యోగ కారకుడైన గురువు వృషభంలో, శని జన్మంలో ఉంటడం వలన గృహ, ఆర్ధిక పరిస్థితులు బాగుండును.
మీన రాశి.. ఈ రాశి వారికి ఆదాయం.. 11, వ్యయం -5, రాజ్యపూజ్యం -2, అవమానం -4 ఈ స్త్రీ, పురుషాదులకు ధన, కుటుంబ కారకుడైన గురుడు 3వ ఇంట సంచారం వలన రాహువు, కేతువు అనుకూలంగా లేకపోవడం వల్ల అనుకున్న పనుల్లో ఆలస్యం అవుతోంది. ముఖ్యంగా ఏల్నాటి శని , జన్మ రాహువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.