Trigrahi Yoga In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి ఈ జూన్ నెల ఎంతో శుభప్రదమైనది గా భావించవచ్చు ఎందుకంటే ఈ నెలలు ఎంతో శక్తివంతమైన కొన్ని గ్రహాలు రాశి సంచారం చేశాయి. అలాగే ఇప్పటికే కొన్ని గ్రహాలు సంచారం, తిరోగమనం చేయడం కారణంగా ప్రత్యేకమైన ప్రభావం కూడా ఏర్పడింది. ఇదిలా ఉంటే 12న మిధున రాశిలోకి శుక్ర, 14న బుధ గ్రహాలు ప్రవేశించాయి. దీని కా రణంగా ఈ రాశిలో ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడింది. ఆ తర్వాత ఈ గ్రహాలు సంచారం చేసిన తర్వాతిరోజే సూర్యుడు కూడా మిధున రాశిలోకి సంచారం చేశాడు. దీని కారణంగా ఒకే రాశిలో మూడు గ్రహాలు కలవడం వల్ల ఎంతో శక్తివంతమైన త్రిగ్రహియోగం ఏర్పడింది. అలాగే సూర్యుడు, బుధుడు కలయిక కారణంగా బుధాదిత్య రాజయోగం కూడా ఏర్పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతోపాటు జూన్ 15న శుక్ర సూర్యగ్రహాలు కూడా మిధున రాశిలో కలవబోతున్నాయి. దీంతో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్రాదిత్య ఏర్పడనుంది. ఈ అన్ని రాజయోగాల ప్రభావం జూన్ 15వ తేదీ నుంచి అన్ని రాశుల వారిపై పడబోతోంది. దీంతో కొన్ని రాశుల వారికి స్వర్ణ యుగం ప్రారంభం కాబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ ప్రత్యేక యోగాల కారణంగా ఎక్కువగా లాభాలు పొందబోయే రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి.


వృషభ రాశి:
ఈ అద్భుతమైన రాజయోగాల కారణంగా వృషభ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయంలో అద్భుతమైన లాభాలను పొందుతారు. అలాగే వీరికి సంపాదన కూడా పెరిగి కొత్త కొత్త వస్తువులను పొందగలుగుతారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వల్ల లాభసాటిగా ఉంటుంది. దీంతోపాటు ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు కూడా లభిస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


కన్యా రాశి: 
బృహస్పతి సంచారం కారణంగా కన్యా రాశి వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి బృహస్పతి అనుగ్రహం లభించి, జీవితంలో వస్తున్న సమస్యలన్నీ అంతేకాకుండా కెరీర్‌కు సంబంధించిన విషయాల్లో కూడా అనేక మార్పులు వస్తాయి. దీంతోపాటు వైవాహిక జీవితం గడుపుతున్న వారికి చాలా అద్భుతంగా ఉంది. అంతేకాకుండా మీరు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలను పొందగలుగుతారు. అలాగే ఎలాంటి వ్యాపారాలు చేసిన ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయి. ఇవే కాకుండా మరెన్నో లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రాశి వారికే కాకుండా మకర, మీనరాశి వారికి కూడా ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి