Tuesday Remedies: కుడి చేత్తో దానం చేస్తే..ఎడం చేతికి తెలియకూడదంటారు. ఇలాంటి గుప్త దానాలు చేసేవారు ఎప్పుడు శుభఫలితాలను పొందుతారని గ్రంథాలు చెబుతున్నాయి.హిందువులు మంగళవారం ఆంజనేయస్వామిని (Lord Hanuman) పూజిస్తారు. ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మీ జీవితంలోని సంక్షోభాలన్నీ తొలగిపోతాయి. దీంతోపాటు కుజ గ్రహం యెుక్క అశుభ ప్రభావాలను తగ్గించవచ్చు. మంగళవారం నాడు ఏమి  దానం చేస్తే శుభం జరుగుతుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వస్తువులను దానం చేయండి
>> మంగళవారం ఉదయం ఎరుపు రంగు బట్టలు మరియు ఆపిల్, అనాసపనాస వంటి ఎరుపు రంగు పళ్లను దానం చేయాలి. దీనితో పాటు పప్పు దానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు.  


>> జాతకంలో మాంగ్లిక్ దోషం ఉన్నవారు ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించాలి. ఈ రోజున ఎర్రని పప్పు దానం చేయడం వల్ల అంగారకుడి అశుభాలు తగ్గుతాయి మరియు వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయి. 


>> మంగళవారం నాడు శెనగపిండి లడ్డూలను దానం చేయడం వల్ల ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా జాబ్ లో ప్రమోషన్ వస్తుంది.  


>> మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, రోగాల నుండి విముక్తి పొందాలన్నా ఈ రోజు కొబ్బరికాయను దానం చేయడం మంచిది. 


>> మిమ్మిల్ని కష్టాలు చుట్టుముట్టినట్లయితే.. మంగళవారం ఆంజనేయుడిని పూజించడంతోపాటు బెల్లం దానం చేయడం మంచిది. దీని వల్ల కష్టాలన్నీ తొలగిపోయి...మళ్లీ మీ  జీవితంలోకి ఆనందం వస్తుంది. 


Also Read: Shami Patra: శ్రావణంలో శివుడికి శమీ పత్రాన్ని ఎందుకు సమర్పిస్తారు? దీని వెనుకున్న ఆసక్తికర కథ ఏంటి? 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook