Shami Patra: శ్రావణంలో శివుడికి శమీ పత్రాన్ని ఎందుకు సమర్పిస్తారు? దీని వెనుకున్న ఆసక్తికర కథ ఏంటి?

Shami Plant Rules: శివుడికి ఎంతో ప్రీతికరమైన మాసం శ్రావణం. ఈ మాసంలో ముఖ్యంగా శివభక్తులు శివారాధన చేస్తారు. ఈ మాసంలో శివునికి శమీ పత్రాన్ని సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 25, 2022, 04:28 PM IST
Shami Patra: శ్రావణంలో శివుడికి శమీ పత్రాన్ని ఎందుకు సమర్పిస్తారు? దీని వెనుకున్న ఆసక్తికర కథ ఏంటి?

Shami Plant Rules: శ్రావణ మాసంలో శివునికి (Lord Shiva) ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఈ మాసంలో పరమేశ్వరుడి అనుగ్రహం పొందడానికి భక్తులు అనేక రకాల చర్యలు తీసుకుంటారు. శ్రావణంలో శివలింగాన్ని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ధాతుర, మందార, బిల్వ పత్రాలు, శమీ ఆకులు శివారాధనలో పవిత్రమైనవిగా భావిస్తారు. అందుకే వీటిని మహాదేవుడికి సమర్పిస్తారు. శివుడికి శమీపత్రం (Shami Patra) ఎందుకు సమర్పిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. 

శమీ పత్రం ప్రాముఖ్యత
హిందువులు శమీ వృక్షాన్ని జమ్మి చెట్టు లేదా ఆరణి అనే పేర్లతో కూడా పిలుస్తారు.  శ్రావణ మాసంలో శివుడికి శమీపత్రం సమర్పించడం చాలా పవిత్రమైనదిగా గ్రంథాలలో చెప్పబడింది. దీంతో శివుడి అనుగ్రహం భక్తులపై ఎల్లప్పుడూ ఉంటుంది.  శ్రావణ మాసంలో శివలింగానికి జలాభిషేకం చేసిన తర్వాత పాలు సమర్పించడం శ్రేయస్కరం. 

శమీ పత్ర నియమాలు
శ్రావణ మాసంలో శివునికి శమీ పత్రాన్ని సమర్పించడం వల్ల కోరుకున్న కోరిక నెరవేరుతుంది. శ్రావణ మాసంలో సోమవారం నాడు ఉదయాన్నే గోపురం వద్దకు వెళ్లి తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చోవాలి. దీని తరువాత, ఒక రాగి పాత్రలో నీరు, గంగాజలం, తెల్ల చందనం మొదలైన వాటిని కలిపి శివలింగానికి పూయాలి. ఈ సమయంలో ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి. దీని తరువాత శివలింగానికి బిల్వపత్రాలు, తెల్లని బట్టలు, బియ్యం, శమీ ఆకులు సమర్పించండి. శమీ పత్రాన్ని సమర్పించేటప్పుడు ఓం నమః శివాయ మంత్రాన్ని పఠించండి.

శమీపత్రం ఎందుకు శుభప్రదం?
గ్రంధాల ప్రకారం శమీ వృక్షం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. శ్రీరాముడు రావణుడిని సంహరించిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు, అతను శమీ వృక్షాన్ని పూజించాడని చెబుతారు. మరొక కథ ప్రకారం, మహాభారతంలో వనవాసం కాలంలో పాండవులు శమీ వృక్షంపైనే ఆయుధాలు దాచారు. అందుకే శమీ వృక్షాన్ని శుభప్రదంగా భావిస్తారు.

Also Read: చాలా ఏళ్ల తర్వాత ఒకేరోజు శ్రావణ శివరాత్రి, మంగళగౌరీ వ్రతం.. శుభ ముహూర్తం ఇదే!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News