Tuesday Remedies: హిందూ సంప్రదాయం ప్రకారం.. వారంలో మంగళవారం హనుమంతునికి ప్రీతికరమైన రోజుగా పరిగణిస్తారు. మంగళవారం హనుమంతుని ఆరాధించడం వల్ల ఆయన అనుగ్రహం ఉంటుందని భక్తుల నమ్మకం. అయితే హనుమంతుని అనుగ్రహంతో శని దేవుని ఆగ్రహానికి గురయ్యేందుకు అవకాశం ఉందని అంటున్నారు. అందుకే శని నుంచి విముక్తి పొందాలంటే హనుమంతుని అనుగ్రహం తప్పనిసరి అని భక్తులు విశ్వసిస్తున్నారు. అయితే ఆంజనేయ స్వామిని పూజించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. హనుమంతుని ప్రసన్నం చేసుకునేందుకు సులభమైన మార్గాలు ఏంటో చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మత గ్రంధాల ప్రకారం.. హనుమాన్ ను ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం నాడు కుంకుమ లేదా ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి. ఎందుకంటే ఈ రెండు రంగులు ఆంజనేయ స్వామిని ప్రీతికరమైనవని భక్తులు భావిస్తున్నారు. దీని వెనుక ఒక ప్రసిద్ధ కథ ఉంది. పురాణాలు ప్రకారం.. సీతమ్మ తల్లి నుదుటిన సింధూరం లేదా కుంకుమ పెట్టుకుంటున్న సమయంలో హనుమంతుడు గమనిస్తారు. 


నుదుటిన సింధూరాన్ని ఎందుకు ధరిస్తున్నారని సీతమ్మ తల్లిని అడగ్గా.. అది శ్రీరామునికి ఇష్టమని ఆమె చెప్పారు. దీంతో శ్రీరాముని కోసం ఆంజనేయ స్వామి సింధూరాన్ని శరీరమంతా పూసుకుంటారని తెలుస్తోంది. ఆ విధంగా హనుమంతుని చూసిన రాముడు ఒక్కసారిగా నవ్వుతాడు. అదే సమయంలో ఈ రంగుతో గుర్తింపు వస్తుందని శ్రీరాముడు హనుమంతుడిని దీవిస్తాడు. అప్పటి నుంచి ఆయనకు కుంకుమ లేదా సింధూరం రంగు లేదా ఆ రంగు కలిగిన వస్త్రాలు అంటే చాలా ఇష్టమని తెలుస్తోంది.  


మంగళవారం హనుమాన్ జపం..


మంగళవారం నాడు హనుమాన్ జపం చేయడం చాలా శ్రేయస్కరమని కొందరు భక్తులు నమ్ముతుంటారు. మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని జపించడం మూలంగా అనేక అవరోధాల నుంచి విముక్తి పొందేందుకు అవకాశం ఉందని భావిస్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. మంగవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి పూజించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. 


Also Read: Janhvi Kapoor Photos: జాన్వీ కపూర్ క్లీవేజ్ షో.. అసలు ఊపిరి ఆడనివ్వడం లేదు!


Also Read: Pallavi Dey Suicide: సినీ పరిశ్రమలో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న టీవీ సీరియల్ నటి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.