Pallavi Dey Suicide: ప్రముఖ బెంగాలీ నటి, టీవీ యాక్టరస్ పల్లవి డే అనుమానాస్పదంగా మృతి చెందారు. కోల్ కతా గార్ఫా ప్రాంతంలోని తన ఫ్లాట్ లో ఆదివారం శవమై కనిపించారు. పల్లవి.. తన నివాసంలోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నటి పల్లవి మృతి పట్ల ఆమె సన్నిహితులు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆ వెంటనే పోలీసులు పల్లవిని కోల్ కతాలోని MR బంగూర్ ఆసుపత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే పల్లవి ఆత్మహత్యకు కారణాలేంటో కనుగొనేందుకు పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
ప్రస్తుతం 'మోన్ మనే నా' అనే టీవీ షోలో ప్రధాన పాత్రలో పల్లవి డే నటిస్తోంది. పలు సీరియల్స్‌లో నటించి ఫేమస్ అయిన పల్లవి.. సోగ్నిక్ చక్రవర్తితో కలిసి 'లివింగ్ టుగెదర్' తరహాలో ఒకే ఇంట్లో ఉండేదని సమాచారం. ఈ క్రమంలో సోగ్నిక్ చక్రవర్తి ను కూడా విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
Also Read: RRR on Zee5: జీ5లో ఆర్ఆర్ఆర్ సినిమా ఎలా చూడాలి, పే పర్ వ్యూ అంటే ఏంటి
Also Read: Samantha-Vijay devarakonda: ఖుషి టైటిల్‌తో వస్తున్న సమంత, విజయ్.. ఫస్ట్‌లుక్ అదిరిపోయింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.