Tulsi Pooja Tips: తులసి మొక్క ప్రాధాన్యత, మహత్యమే వేరు. సరైన విధంగా పూజిస్తే కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం. అందుకే తులసి మొక్క విషయంలో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూమతంలో తులసి మొక్కకున్న ప్రాధాన్యత, మహత్యముంది. ఈ మొక్క కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రాధాన్యత కలిగింది. తులసిలో ఉన్న ఔషధ గుణాలు మరే ఇతర మొక్కలోనూ లేవంటే అతిశయోక్తి కాదు. తులసి మొక్కను పూర్తి విధి విధానాలతో పూజిస్తే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు. తులసి మొక్క ఇంటికి అందాన్నే కాకుండా..ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసానికి కారణమౌతుందనేది హిందూమతం విశ్వాసం.  తులసి మొక్కకు పూజలు చేసే సమయంలో పాటించాల్సిన కొన్ని సూచనలు, పద్ధతుల గురించి తెలుసుకుందాం...


తులసి మొక్కతో ఉపయోగాలు, పూజా పద్ధతులు


హిందూమత గ్రంధాల ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి ఆవాసముంటుంది. అందుకే తులసి మొక్కకు పూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజించాలి. తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమై..భక్తుల కోర్కెలు నెరవేరుతాయి. తులసి మొక్కకు ఉదయం సమయంలో నీళ్లు పోయాలి. కానీ సాయంత్రం సూర్యాస్తమయం తరువాత నీళ్లు పోయకూడదు. నెయ్యితో దీపం మాత్రం వెలిగించాలి. 


మీకు ఒకవేళ వ్యాపారంలో నష్టాలు వస్తుంటే ప్రతి శుక్రవారం నాడు తులసి మొక్కకు ఒక స్పూన్ పాలు పోయాల్సి ఉంటుంది. ఇలా కొన్ని శుక్రవారాలు చేస్తే మీ సమస్యలు దూరమౌతాయి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఇక మీ అమ్మాయి పెళ్లి ఆలస్యమౌతుంటే..తులసి మొక్కను నిర్ణీత పద్ధతిలో పూజించి..జలాభిషేకం చేయాలి. ఆ తరువాత మీ కోర్కెలు నివేదించాలి. చాలాకాలంగా ఎన్నిసార్లు నివేదించినా మీ కోర్కెలు నెరవేరకపోతే..కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటించాలి. ఇత్తడి చెంబులో నీళ్లు తీసుకుని..అందులో 4-5 తులసి ఆకులు వేయాలి. ఈ చెంబును 24 గంటలు అలానే ఉంచేయాలి. ఆ తరువాత మొత్తం ఇంట్లో ఈ నీటిని చల్లాలి. ఇలా చేయడం వల్ల మీ కోర్కెలు తప్పకుండా నెరవేరుతాయి.


Also read: Shami Patra: శ్రావణంలో శివుడికి శమీ పత్రాన్ని ఎందుకు సమర్పిస్తారు? దీని వెనుకున్న ఆసక్తికర కథ ఏంటి?



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook