Ugadi Festival 2022: తెలుగు లోగిళ్లన్నీ ఉగాది శోభను సంతరించుకుంటున్నాయి. తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాదిని ఘనంగా జరుపుకునేందుకు తెలుగు ప్రజలు సిద్ధమవుతున్నారు. ప్లవ నామ సంవ్సరాన్ని వీడి శుభకృత్ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది నాడు ఏయే పనులు చేయాలో, ఏయే పనులు చేయకూడదో  తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉగాది పండుగ పూట ఈ నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉగాది పండుగ పూట చేయకూడని పనులు :


ఉగాది పర్వదినాన ఆలస్యంగా నిద్ర లేవకూడదు. కొంతమందికి ఉదయాన్నే నిద్ర లేచే అలవాటు ఉండదు. అలాంటివారు ఉగాది పండగ పూట మాత్రం కచ్చితంగా ఉదయాన్నే నిద్ర లేవాలి. 


కొంతమందికి ముక్క, చుక్క లేనిదే ముద్ద దిగదు. కానీ ఉగాది రోజు ముక్క, చుక్క రెండింటికీ దూరంగా ఉండాలి.


పండగ పూట పాత బట్టలు కాకుండా కొత్త బట్టలు ధరించాలి.


పంచాగ శ్రవణ సమయంలో దక్షిణ ముఖంగా కూర్చోకూడదు. 


ఉగాది పండుగ పూట చేయాల్సిన పనులు :


సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగ స్నానం చేయాలి. శరీరానికి, తలకు, నువ్వుల నూనె రాసుకుని.. సున్ని పిండితో తైలాభ్యంగ స్నానం చేస్తే మంచిది. 


స్నానం తర్వాత కొత్త దుస్తులు ధరించి దైవారాధన చేయాలి. ఎక్కువమంది తమ ఇళ్లలో దమనేన పూజ నిర్వహిస్తారు. అంటే సుగంధం వెదజల్లే ప్రతితో పూజ నిర్వహిస్తారు. చైత్ర శుక్ల పాడ్యమి రోజున బ్రహ్మకు, విదయ రోజున శివుడికి, తదియ రోజున గౌరీ శంకరులకు, చతుర్థి రోజున వినాయకుడికి.. ఇలా పౌర్ణమి వరకు నిత్య పూజలు చేయాలి.


పూజ అనంతరం సూర్య నమస్కారం చేయాలి.


పేదలకు ఛత్రచామరాలను దానం చేస్తే విశేషమైన ఫలితాలు పొందుతారు.


Also Read: Ugadi 2022 Panchangam: పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా? లేదా?.. ఉగాది పంచాంగం ఏం చెబుతోందంటే?


Also Read: Rashmika Mandanna: ఊహించని షాక్.. రష్మికను సైడ్ చేసిన విజయ్?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook