Ugadi Festival 2023: హిందూ నూతన సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్షం నుంచి ప్రారంభమవుతుంది. ఈ సారి చైత్ర శుక్లం మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. కాబట్టి ఇదే రోజునే ఉగాది పండగను జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ రోజులను  చైత్ర నవరాత్రులు అని కూడా అంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని గ్రహాల సంచారాల వల్ల ఉగాది రోజున  4 రాశులకు చెందిన వారికి చాలా శుభప్రదంగా మారబోతోంది. అయితే ఈ ఉగాది రోజున ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అన్ని రాశులవారికి కొత్త సంవత్సరం ప్రభావం పడుతుంది. దీని కారణంగా అన్ని రాశులవారి జీవితాల్లో పలు మార్పులు కూడా సంభవిస్తాయి. ఈసారి 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలో శని గ్రహం సంచార దశలో ఉన్నాడు. రాహువు, శుక్రుడు మేషరాశిలో, కేతువు తులారాశిలో, కుజుడు మిధునరాశిలో సంచారంలో ఉన్నాయి.


ఈ రాశులవారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు:
ధనుస్సు:

ధనుస్సు రాశివారికి ఉగాది శుభప్రదంగా,  ఫలప్రదంగా మారబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో ఈ రాశివారికి అదృష్టం పెరుగుతుంది. అంతేకాకుండా వ్యాపార పరంగా చాలా రకాల లభాలు పొందే ఛాన్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు. స్నేహితులతో ఖుషిగా సమయాన్ని గడిపే అవకాశం కూడా పొందుతారు. ఈ రాశివారు కొత్త ఉద్యోగాలు కూడా పొందే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


తుల రాశి :
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..ఈ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా మారబోతోంది. ఏదైన అడ్డంకులు, సమస్యలతో బాధపడేవారికి ఈ క్రమంలో ఉపశమనం లభిస్తుంది. వృత్తి జీవితంలో శత్రువులు ఆధిపత్యం వహించలేరు. విద్యారంగంలో మంచి విజయాలు పొందే ఛాన్స్ ఉంది.


సింహం:
చైత్ర శుక్ల ప్రారంభంలో సింహ రాశి వారికి విశేష ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రాశివారు పూర్వీకుల ఆస్తి పొందడమేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి సహాయ, సహకారాలు లభించి విశేష ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


మిథునం:
కొత్త సంవత్సరంలో మిథునరాశి వారి జీవితాలపై ప్రభావం పడనుంది. ఈ రాశుల వ్యక్తులు జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్న వ్యక్తులకు ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. అంతేకాకుండా వ్యాపారంలో ఈ రాశివారు విజయాలు సాధించి భారీ లాభాలు పొందుతారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి మంచి ఉపశమనం లభిస్తుంది.


Also read: Heavy Rains: తెలుగు ప్రజలకు అలర్ట్, మరో 48 గంటలు కొనసాగనున్న వర్షాలు


Also read: Heavy Rains: తెలుగు ప్రజలకు అలర్ట్, మరో 48 గంటలు కొనసాగనున్న వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook