For Immense Money & Health to Bring Chinese Coins on Ugadi 2023 Day: 'హిందూ నూతన సంవత్సరం' బుధవారం (2023 మార్చి 22) నుంచి ప్రారంభమవుతుంది. అంటే.. తెలుగు పంచాంగం ప్రకారం 'ఉగాది' పండగ రోజునే హిందూ నూతన సంవత్సరం అని అంటారు. కొత్త సంవత్సరం రోజున పచ్చడి తాగడానికి అందరూ సిద్దమయ్యారు. మరోవైపు కొత్త ఏడాదిలో తమ జాతకం ఎలా ఉండబోతుందో అని ఇప్పటికే చాలా మంది పంచాంగం చూసుకుంటున్నారు. అయితే నూతన సంవత్సరంలో ఆనందం, శాంతి, సంపద మరియు శ్రేయస్సు ఉండాలంటే.. ఉగాది రోజున ఈ ప్రత్యేక వస్తువును ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుందని చైనీస్ వాస్తు శాస్త్రం (Feng Shui) చెపుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చైనీస్ వాస్తు శాస్త్రం ఒక వ్యక్తి జీవితంలో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు ఉండడానికి చైనీస్ వాస్తు శాస్త్రం ఫెంగ్ షుయ్‌లో అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఇంటి నుంచి ప్రతికూల శక్తిని తొలగించడంలో మరియు సానుకూల శక్తి యొక్క కమ్యూనికేషన్‌ను పెంచడంలో ఫెంగ్ షుయ్‌ సహాయపడుతుంది. చైనీస్ వాస్తు శాస్త్రం ప్రకారం.. చైనీస్ నాణేలు అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడతాయి. ఇవి వ్యక్తి యొక్క ఆర్థిక స్థితికి సంబంధించినది. 


ఉగాది రోజున (Ugadi Festival 2023) చైనీస్ నాణేలు ఇంటికి తెచ్చుకుంటే.. ఏడాదంతా అదృష్టం ఉంటుందట. అంతేకాదు సంవత్సరం పొడవునా డబ్బు ఉంటుందట. కొత్త సంవత్సరాన్ని శుభప్రదంగా మార్చుకోవాలన్నా, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలన్నా ఫెంగ్ షుయ్ నాణేలు ఉపయోగపడుతాయి. ఫెంగ్ షుయ్ నాణేల వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం. 


ఫెంగ్ షుయ్ నాణేల ప్రయోజనాలు (Benefits of Feng Shui Coins): 
# ఫెంగ్ షుయ్ నాణేలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ నాశనం అవుతుంది.
# పర్స్‌లో చైనీస్ నాణేన్ని ఉంచుకోవడం ద్వారా వ్యక్తి జీవితంలో డబ్బుకు ఎప్పుడూ కొరత ఉండదు.
# ఏదైనా ఇబ్బందిని వదిలించుకోవడానికి మూడు చైనీస్ నాణేలను మీ వద్ద ఉంచుకోవచ్చు.
# ఫెంగ్ షుయ్ నాణేలు ప్రతికూల శక్తిని తొలగిస్తాయి. దాంతో ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది.
# ఇంటి ప్రధాన ద్వారం వద్ద చైనీస్ నాణేలను వేలాడదీస్తే.. అది చాలా శుభం మరియు ఫలవంతమైనది.
# ఇంటి ప్రధాన ద్వారం వద్ద చైనీస్ నాణేలను ఉంచడం వల్ల దుష్ట శక్తులు నివాసం ఉండవు. పేదరికం కూడా దూరమవుతుంది.
# ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే.. ఈ మూడు నాణేలను ఎర్రటి దారంలో కట్టి, కొత్త సంవత్సరంలో ఇంట్లో వేలాడదీయండి.
# పదే పదే పనిలో ఆటంకం ఏర్పడితే.. చిన్న ఫెంగ్ షుయ్ నాణేలను పర్సులో ఉంచుకోవచ్చు.


Also Read: iQOO Z7 5G Launch: 20 వేల కంటే తక్కువ ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్ అదుర్స్, సూపర్ లుకింగ్!   


Also Read: Brave Lady Traps Black Cobra: కాటు వేయటానికి వచ్చిన కింగ్ కోబ్రాను ఈజీగా కంట్రోల్ చేసిన అమ్మాయి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి