iQOO launched iQOO Z7 5G Smartphone in India Price & Specifications: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ 'వివో'కు చెందిన సబ్ బ్రాండ్ ఐకూ (iQoo) మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఐకూ జడ్7 5జీ (iQoo Z7 5G Smartphone) పేరిట ఈ మొబైల్‌ను నేడు లాంచ్ చేసింది. భారత్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఐకూ జడ్7 5జీని తీసుకొచినట్టు ఐకూ పేర్కొంది. ఈ ఫోన్ మిడ్ రేంజ్ కేటగిరీలోకి వస్తుంది. ఈ మొబైల్ రెండు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ విక్రయాలు మంగళవారం (మార్చి 21) నుంచే ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐకూ జడ్7 5జీ ఫీచర్లను ఓసారి చూద్దాం.
iQoo Z7 5G Smartphone Price:
ఐకూ జడ్ 7 5జీ రెండు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6 జీబీ, 128 జీబీ వేరియంట్ ధర రూ. 18999గా కంపెనీ నిర్ణయించింది. ఇక 8 జీబీ, 128 జీబీ వేరియంట్ ధర రూ. 19999గా ఐకూ కంపెనీ పేర్కొంది. బ్యాంక్ ఆఫర్‌తో కొనుగోలు చేసిన వారికి బేస్ వేరియంట్ ఐకూ జడ్ 7 5జీ రూ. 17499కే లభిస్తుంది. అమెజాన్, ఐకూ ఇ-స్టోర్ల నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. నార్వే బ్లూ, పసిఫిక్ నైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.
iQoo Z7 5G Smartphone Camera:
ఐకూ జడ్ 7 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6.38 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. 90హెర్జ్ రీఫ్రెష్ రేట్ ఉన్న ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్‌తో ఔట్ ఆఫ్ ది బాక్స్ ఉంది. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్‌సిటీ 920 ప్రాసెసర్‌తో వస్తుంది. వెనుక వైపు 64 ఎంపీ మెయిన్ కెమెరా ఉండగా.. 2 ఎంపీ పోర్ట్రెయిట్ లెన్స్‌ను అమర్చారు. ముందువైపు సెల్ఫీల కోసం 16 ఎంపీ పంచ్ హోల్ కెమెరా ఉంటుంది. వెనుక వైపు కెమెరాతో 4కె వీడియోలను రికార్డు చేయొచ్చు.
iQoo Z7 5G Smartphone Battery:
ఐకూ జడ్ 7 5జీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నల్ స్టోరేజీని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్.. 44W ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వైఫై 6, బ్లూటూత్ 5.2, 3.5 ఎంఎం జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ కలిగిన ఈ ఐకూ జడ్ 7 5జీ స్మార్ట్‌ఫోన్ ప్లాస్టిక్ బాడీతో వస్తోంది. రూ. 20 వేల్లోపు 5జీ ఫోన్ కోసం చూస్తున్న వారికి ఈ స్మార్ట్‌ఫోన్ మంచి ఎంపిక కానుంది.
Aslo Read: Brave Lady Traps Black Cobra: కాటు వేయటానికి వచ్చిన కింగ్ కోబ్రాను ఈజీగా కంట్రోల్ చేసిన అమ్మాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి