Ugadi Rasi Phalalu Kanya Rasi 2024 -25: ఉగాది.. యుగాది అని కూడా ఉంటారు. యుగానికి ఆరంభ దినం కనుక ఉగాదిని తొలి పండగగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రకృతి మొత్తం లేత చివుళ్లతో, రంగురంగుల పూలతో ముస్తాబై ఆహ్వానం పలికే పండుగ అద్భుతమైన ఉగాది. మత్త కోయిలల కుహూగానాలతో ఉగాదికి కొత్త సోయగాలు తీసుకువస్తాయి. ఉగ అంటే నక్షత్ర గమనం. ఈ నక్షత్ర గమనానికి ఆది ఉగాది. సృష్టి ఆరంభమైన రోజే ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమి రోజునే బ్రహ్మ సృష్టి ఆరంభించాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు మత్యావతారంలో సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన రోజునుండే ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. ఉగాది తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే అసలు సిసలు పండుగ .  ఈ క్రోది నామ సంవత్సరంలో 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయి. అందులో 6వ రాశి అయిన కన్య రాశి వారికీ ఈ సారి ఎలా ఉండబోతున్నాయో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్య రాశి.. ఉత్తర 2,3,4 పాదాలు..హస్త, చిత్త 1, 2 పాదాలు


క్రోధి నామ సంవత్సరంలో  కన్య రాశి ఫలితాలు.. ఆదాయం 5 వ్యయం 5.. రాజపూజ్యం 5 అవమానం 2


క్రోధి నామ సంవత్సరంలో కన్య రాశి వారికి అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. విద్యా, బుద్ధి,జ్ఞానముకు సంబంధించిన బృహస్పతి భాగ్య స్థానమైన 9వ ఇంట సంచరించడం వలన అనేక శుభ ఫలితాలు అందుకుంటారు. శని దేవుడు ఆరింట అత్యంత బలీయంగా ఉండటం వలన ఈ రాశి వారికీ పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. ఎంత టాలెంట్ ఉన్న ఒక్కొసారి అనుకున్న పనులు జరగవు. అకారణంగా మాటలు పడటం.. రావలసిన బాకీలు రాకుండట వీరికి కొంచెం ఇబ్బంది కలిగించే అంశాలు అనే చెప్పాలి. ప్రయాణంలో ఒత్తిడి ఎదుర్కొంటారు. ఈ రాశి వారికి యాభై శాతానికి పైగా శుభ ఫలితాలు అందుకుంటారు. మే నుండి గురు బలం వల్ల ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ధన లాభం, గృహ లాభం, మంచి భోజనం తదితర ఫలితాలు ఉంటాయి. శని ఆరవ ఇంట స్వ క్షేత్రంలో ఉండటం వలన పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా జీవితం సాగుతోంది. ఉద్యోగులకు చేసే పనిలో ప్రమోషన్ గ్యారంటీ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీవితం సాపీగా సాగిపోతుంది.
నిరుద్యోగులు ఎంతో కాలంగా చేస్తోన్న ఉద్యోగం లభిస్తోంది. ప్రైవేటు ఉద్యోగులు ఉద్యోగం మారితే కానీ వారి జీవితాలు బాగుపడని రీతిలో ఉంటాయి. కొంత నిరుత్సాహాంగా జీవితం సాగిపోతుంది.


రాజకీయ నాయకుల విషయానికొస్తే.. శని బలం వలన రాజకీయాల్లో మంచి గుర్తింపు వస్తోంది. అవసరానికి అనుగుణంగా వ్యవహరించడం వల్ల ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. పార్టీ పరంగా మంచి గుర్తింపు ఉంటుంది. పార్టీలో ఏదో ఒక పదవి లభిస్తోంది.
సినిమా  కళాకారులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మంచి ఫలితాలు అందుకుంటారు. తమ రంగాల్లో విజయం అందుకుంటారు. అవార్డుల విషయంలో నిరాశ  తప్పదు.
క్రోధి నామ సంవత్సరంలో వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. కొన్ని పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. సిమెంటు, కంకర వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వారికీ కొంత మేర లాభాలు ఉండే అవకాశాలున్నాయి.
ఈ యేడాది గురు బలం కారణంగా చదువుపై శ్రద్ధ ఉంటుంది. స్నేహితులతో మంచి సంబంధం కొనసాగుతోంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇంజినీరింగ్, మెడిసన్, లాసెట్, ఇసెట్, బిఈడీ పాలిటెక్నిక్ మొదలగు పరీక్షలు రాసిన వారికీ తగిన సీట్లు లభించకపోవచ్చు.
వ్యవసాయ దారులకు మొదటి పంట కంటే రెండవ పంట ఫలించును. ఆదాయం ఎంతో ఉంటుందో ఖర్చులు అదే రేంజ్‌లో ఉంటాయి.
 
కన్య రాశి స్త్రీలకు కొంచెం ఇబ్బంది కర పరిస్థితులు ఉంటాయి. భర్తతో సఖ్యత అవసరం. అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులను ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. పెళ్లి కానీ ఈ రాశి స్త్రీలకు ద్వితీయార్ధంలో తప్పుక వివాహాం జరుగును. వివాహామై సంతానం లేని వారికీ ఈ యేడాది మంచి శుభవార్త వింటారు. ఆనందాన్ని, సంకల్ప సిద్ధిని పొందుతారు. ఈ రాశి వారు మంగళ వార నియమాలు పాటిస్తే, రాహు, కేతు జపాదులు చేసుకోవడంతో శుభ ఫలితాలను అందుకుంటారు.


Read More: BRS To TRS: బీఆర్ఎస్ పేరును మార్చే ఆలోచనలో ఉన్నాం... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook