Ugadi Panchangam : వేద జ్యోతిష్యంల్లో నవ గ్రహాలు ఎల్లపుడు ఒక రాశి నుంచి మరొకి రాశిలోకి  మారుతూ  తమ గమనాలను మార్చుకుంటూ ఉంటాయి. ఇలా గ్రహాల రాశి మార్పు మొత్తం 12 రాశి చక్రాలను ప్రభావితం చేస్తోంది.  ఉగాది తెలుగు నూతన సంవత్సరాది నేటి నుంచి ప్రారంభం అయింది. ఈ సందర్భంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు దూది పింజల్లా  ఎగిరిపోయనున్నాయి. కొన్ని రాశుల వారికీ అదృష్ట యోగం పట్టబోతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి..  
ఈ రాశి వారికి ఆదాయం 8.. వ్యయం..14.. రాజ్య పూజ్యం 4.. అవమానం.. 3


ఈ రాశి వారికి అదృష్ట యోగం 75 శాతం ఉంది. ఈ రాశి భాగ్య, వ్యయాధిపతి ధన స్థానంలో ఉన్నాడు. మరోవైపు శని దేవుడు 11వ ఇంట బలీయంగా ఉన్నాడు. రాహువు, కేతువు, వ్యయం, షష్ఠమము ఉండుట వలన మంచి ధనయోగ ప్రాప్తి ఉంటుంది. కెరీర్‌ పరుగులు పెడుతోంది. కొత్త ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలున్నాయి. ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి మంచి టైమ్.  అంతేకాదు ఎంతో కాలంగా పెళ్లి కానీ యువతి యువకులు ఈ యేడాది పెళ్లి చేసుకోవడం గ్యారంటీ.  మాటను అదుపులో ఉంచుకోండి..


వృషభ రాశి..  
ఈ రాశి వారికి ఆదాయం.. 2.. వ్యయం.. 8 రాజ్యపూజ్యం -7 అవమానం - 3


ఈ రాశి స్త్రీ పురుషులకు అష్టమ లాభాధిపతి ధనము, సంపద, కుటుంబానికి కారకుడైన గురుడు జన్మంలో ఉన్నాడు. శని రాజ్య స్థానంలో ఉండటం వలన ఈ రాశి వారికి పట్టిందల్ల బంగారమే అన్నట్టుగాఉంటుంది.  కొన్ని ఒడిదుడుకలు ఎదుర్కొన్నాచివరకు విజయం సాధిస్తారు. ఇపుడున్న కెరీర్‌లో కొనసాగాలా.. వేరే కొత్త కెరీర్‌ను ఎంచుకోవాలనేది డిసైడ్ చేసుకోవాలి. ఏది చేయాలనుకుంటున్నారో దానికి ఇదే అనువైన సమయం. ఏ విషయమైన ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.


మిథున రాశి..
ఈ రాశి వారికి ఆదాయం.. 5 వ్యయం. 5 రాజ్యపూజ్యం -3 అవమానం - 6


ఈ రాశి వారికి బుద్ది, ధనము, కుటుంబ కారకుడైన గురుడు బలీయంగా ఉన్నాడు. శని, రాహువు బలీయంగా ఉంటడం వలన ఈ రాశి వారికి అన్ని విధాల యోగంగా ఉంటుంది. భార్యా, భర్తలు కలిసి ఏ పనిచేసినా.. విజయం తథ్యం.. నూతన గృహ, వాహన యోగం ఉంది. ఉగాది తర్వాత వీరి జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయి.  కెరీర్‌లో పురోభివృద్దికి ఇదే అనువైన సమయం. శారీరక ఆరోగ్యం విషయంలో యోగాభ్యాసం, వ్యాయామాలు చేయడంపై దృష్టి సారించాలి.


కర్కాటక రాశి..
ఈ రాశి వారికి ఆదాయం.. 14, వ్యయం -2, రాజ్యపూజ్యం -6, అవమానం -6


ఈ రాశి స్త్రీ, పురుషులకు ధనము, విద్య, సంపద, బుద్ధి, సంతానముకు కారకుడైన గురుడు మంచి స్థానంలో ఉండటం వలన ఎలాంటి కష్టసాధ్యమైన పనులైనా అవలీలగా చేస్తారు. వ్యక్తిగతంగా, సాంఘికంగా గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి.   కెరీర్‌లో పరుగులు పెడుతోంది. ఎంచుకున్న రంగాల్లో కెరీర్ గ్రోత్ ఉంటుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్టు జీవితం సాఫీగా సాగిపోతుంది.  ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలున్నాయి. ఈ కాలంలో ఏదైనా పని ప్రారంభిస్తే సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఆర్ధికంగా స్థిర పడే అకకాశాలున్నాయి.  మెరుగైన వృద్దికి అవకాశం ఉంది. వృతిగత జీవితం.. వ్యక్తిగత జీవితాల మధ్య బ్యాలెన్స్ చేయాలి.  


సింహ రాశి..
ఈ రాశి వారికి ఆదాయం.. 2, వ్యయం -14, రాజ్యపూజ్యం -2, అవమానం -2


ఈ రాశి వారికి ధన, కుటుంబ కారకుడైన గురుడు పదవ రాశిలో ఉండటం.. మరోవైపు రాహువు అష్టమంలో ఉన్నందున జీవితం పోరాట మయంగా ఉంటుంది. మరోవైపు గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి కానీ వారికి ఈ యేడాది పెళ్లి పీఠలు ఎక్కుతారు.  . మీరు మీ నైపుణ్యాల మెరుగుకు ఇదే సరైన సమయం. కొత్త వాటికి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. గ్రహా స్థితి గతులు అనుకూలంగా లేకపోయినా.. ఆర్ధికంగా స్థితిమంతులవుతారు. అయితే డబ్బు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్త అవసరం. తప్పుడు నిర్ణయాల విషయంలో తగిన జాగ్రత్త వహించాలి.


కన్య రాశి..
ఈ రాశి వారికి ఆదాయం.. 5, వ్యయం -5, రాజ్యపూజ్యం -5, అవమానం -2


ఈ రాశి స్త్రీ, పురుషులకు గురుడు భాగ్యస్థానం అందు సంచారం వలన శని ఆరింటిలో బలీయంగా ఉన్నాడు. ఈ రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలను అందుకుంటారు.
ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న వివాహా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగం విషయంలో అనుకున్న పనులను సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ జీవితం విషయంలో ఎవరితో వాదులాటకు దిగొద్దు.


తుల రాశి..


ఈ రాశి వారికి ఆదాయం.. 2, వ్యయం -8, రాజ్యపూజ్యం -1, అవమానం -5


ఈ రాశి స్త్రీ, పురుషాదులకు దైవ బలం అధికంగా ఉంటుంది. ధనం, కుటుంబం, సంపద, పుత్రులకు కారుకుడైన గురుడు 8వ ఇంట సంచారం లాభిస్తుంది. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతారు. రాహువు, కేతువుల బలము వలన శని 5వ ఇంట ఉండటం వలన విశేషమైన యోగం అనుభవిస్తారు. శత్రు జయము. గతంలో సాధించలేని పనులు పూర్తి చేస్తారు. లాయర్స్, డాక్టర్స్, ఇతర వ్యాపార సంబంధ వృత్తుల్లో ఉన్నవారు తమ క్లైయింట్స్‌తో లాభదాయకమైన ప్రాజెక్ట్‌లకు అనువైన సమయం. అంతేకాదు వ్యాపారస్తులకు ఊహించని లాభాలు అందుకుంటారు. శృంగార జీవితాన్ని ఆస్వాదిస్తారు.  


వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి ఆదాయం.. 8, వ్యయం -14, రాజ్యపూజ్యం -4, అవమానం -5


ఈ రాశి స్త్రీ, పురుషులకు సంబంధించి ధన, కుటుంబానికి సంబంధించి గురుడు 7వ స్థానంలో సంచారం..రాహువు, కేతువు 5, 11 స్థానాల్లో సంచరించడం వలన అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. పట్టిందల్లా బంగారమా అన్నట్టు జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారుల అనుగ్రహము ఉంటుంది. జీవితం మూడు పువ్వులు.. ఆరు కాయలన్నట్టు సాగిపోతుంది.  ఈ రాశి వారు ఎంతో బిజీ లైఫ్‌ను లీడ్ చేసే అవకాశం ఉంది.  మీ జీవితంలో ఎదగడానికి ఇదే చక్కని  సమయం. ఆర్దికంగా లాభాపడడానికి ఇదే అనువైన సమయం. ఆహారం విషయంలో అప్రమత్తత అవసరం. ఆరోగ్యం విషయం జాగ్రత్త.


ధనుస్సు రాశి..


ఈ రాశి వారికి ఆదాయం.. 11, వ్యయం -5, రాజ్యపూజ్యం -7, అవమానం -5



 ఈ రాశికి సంబంధించిన విషయానికొస్తే.. కుటుంబం, ధనస్సు, సంపదకు కారకుడైన గురుడు 6వ ఇంట..రాహువు, కేతువు 4 మరియు 10 స్థానాల్లో ఉన్నారు. శని స్థితి యోగించును. అన్ని రంగాల వారికీ అనుకూలంగా ఉంటుంది. స్వయం ప్రతిభతో సంఘంలో గౌరవం, పలుకుబడి వస్తాయి.
సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది.  ప్రస్తుతం ఉన్న హోదా నుంచి నాయకత్వ పాత్రలో ప్రవేశించడానికి ఇదే గొప్ప ఛాన్స్. శృంగారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.


మకర రాశి..
ఈ రాశి వారికి ఆదాయం.. 14, వ్యయం -14, రాజ్యపూజ్యం -3, అవమానం -1


ఈ రాశి వారికి ఏల్నాటి శని ప్రభావం తగ్గును. ధనం, కుటుంబ కారకుడైన గురువు 5వ ఇంట.. లగ్నాధిపతి శని 2వ ఇంట బలీయంగా ఉండటం వలన జీవితం బలీయంగా ఉంటుంది. ఏ పని చేసిన బ్యాలెన్స్‌గా చేస్తారు. మీ స్వంత ప్రపంచాన్ని సృష్టించడానికి ఇదే అనువైన సయమం. మీ దృష్టి దేశీయ సవాళ్లపై ఉన్నప్పటికీ మీ కెరీర్ వేగాన్ని తగ్గించలేదు. ఉద్యోగంలో ధీర్ఘకాలిక లక్ష్యాలను నిర్ధేశించుకొని పని చేయాలి. చేసే పనితో పాటు వ్యక్తిగత జీవితంపై దృష్టి పెడితే బాగుంటుంది.  గృహ, వాహన యోగం ఉండును.


కుంభ రాశి..
ఈ రాశి వారికి ఆదాయం.. 14, వ్యయం -14, రాజ్యపూజ్యం -6,  అవమానం -1


ఏల్నాటి శని ప్రభావం వల్ల ఆరోగ్య భంగములు.. మానసిక అశాంతి నెలకొంటుంది. యోగ కారకుడైన గురువు వృషభంలో, శని జన్మంలో ఉంటడం వలన గృహ, ఆర్ధిక పరిస్థితులు బాగుండును. ఏ పని చేపట్టినా.. అవలీలగా చేస్తారు. మీరు కొత్త నైపుణ్యాలను పెంపొందిచుకుంటారు. మీ టాలెంట్ ప్రదర్శించడానికి ఇదే సరైన సమయం. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వారి పట్ల ఆకర్షితులయ్యే అవకాశాలున్నాయి.


మీన రాశి..
ఈ రాశి వారికి ఆదాయం.. 11, వ్యయం -5, రాజ్యపూజ్యం -2, అవమానం -4


ఈ స్త్రీ, పురుషాదులకు ధన, కుటుంబ కారకుడైన గురుడు 3వ ఇంట సంచారం వలన రాహువు, కేతువు అనుకూలంగా లేకపోవడం వల్ల అనుకున్న పనుల్లో ఆలస్యం అవుతోంది. ముఖ్యంగా ఏల్నాటి శని , జన్మ రాహువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనో ధైర్యం కోల్పోయే అవకాశాలున్నాయి. నర ఘోష అధికంగా ఉంది.
ఏది ఏమైనా స్ధిరమైన ఆర్ధిక వృద్ధికి తోడ్పడుతోంది. ఇతర స్టాక్ మార్కెట్ ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. ధీర్ధకాలిక లక్ష్యాల సాదనకు ఇదే అనువైన సమయం. సంబంధ బాంధవ్యాలను మెరుగు పరుచుకోవాలి.



Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి  ఈ విషయాన్ని  ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


Also Read: Shobha Karandlaje: ప్రచారంలో అపశ్రుతి.. కేంద్ర మంత్రి కారు తగిలి కార్యకర్త మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook