Ugadi Tula Rasi Phalalu 2024-25: శ్రీక్రోధి నామ సంవత్సరంలో తులరాశివారికి నూతన గృహయోగం, పెళ్లియోగం కూడా ఉండనుంది. మొత్తానికి ఈ ఏడాది తులరాశివారికి ఎలా ఉండనుందో తెలుసుకుందాం. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 ఉంటాయి. ఈ ఏడాది తులరాశివారికి శ్రీక్రోధి నామ సంవత్సరం ఆర్థికం 2, వ్యయం 8 అవమానం 5, రాజపూజ్యం 1. ముఖ్యంగా ఈ ఏడాది తులా రాశి వారికి గురు గ్రహ ప్రభావం ఉంటుంది. అందుకే అనుకున్న పనులు సులభంగా సాధిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో ఉన్న అప్పులు తీర్చమని వేధింపులు కూడా ఎక్కువ అవ్వచ్చు.అందుకే ఈ ఏడాది కుజ సంబంధిత పూజలు, జపాలు చేసుకోవడం మంచిది. గురు గ్రహ పూజలు కూడా చేసుకోవడం మరింత కలిసి వచ్చే అవకాశం. చేతివృత్తుల పనులు చేసే వారికి సాధారణంగా ఉంటుంది. విద్యార్థుల్లో అభివృద్ధి కనిపిస్తుంది ప్రతిభను చూపిస్తారు. 


ఈ ఏడాది తుల రాశి వారు డబ్బు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే, తులరాశి వారికి ఈ ఏడాది విదేశీయానం చేసే అవకాశం కూడా దొరుకుతుంది. తుల రాశి వారికి రావలసిన డబ్బు సమయానికి చేతికి అందదు. అందుకే ఈ సమయంలో కుజ స్తోత్రాలు వంటివి మంచి పరిహాలు చేసుకుంటే చక్కటి మార్గం దొరుకుతుంది.


ఇదీ చదవండి: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది.. ?


మొత్తానికి క్రోధినామ సంవత్సరం తులా రాశి వారికి ఒడిదుడుకులతో కూడుకున్నది హఠాత్తుగా డబ్బులు వస్తాయి ఆ తర్వాత ఖర్చవుతుంది మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. ఇక ఈ క్రోధినామ సంవత్సరంలో చిత్తా నక్షత్రానికి చెందిన వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది, స్వాతి నక్షత్రం వారికి అంతా విజయమే కలుగుతుంది. స్వాతి నక్షత్రం వారికి గృహ యోగం కూడా కలుగుతుంది
రైతులకు రెండు పంటలు చేతికి వస్తాయి ఆదాయం గడిస్తారు. భూ క్రయవిక్రయదారులతో పాటు ఇతర వ్యాపారస్తులకు కూడా ఈ ఏడాది ఆర్థికంగా కలిసి వస్తుంది.


ఇదీ చదవండి: కేదార్‌నాథ్‌ తలుపులు ఏ రోజు తెరుచుకుంటాయి? ఎప్పుడు బుక్ చేసుకోవాలి?


కళారంగంలో ఉన్న వారికి ఏడాది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కొత్త కాంట్రాక్టులతో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఏడాది తులా రాశి చెందిన వారికి ఏళ్ల తరబడి పెళ్లికాకుండా ఉన్నవారికి కూడా  పెళ్లి జరుగుతుంది. కోరుకున్న ఉద్యోగానికి బదిలీ అవుతారు. అంతేకాదు తులరాశివారు కుటుంబంలో సఖ్యత ఉంటుంది.తులా రాశి వారికి సంతానం వల్ల ఆర్థిక లాభాలు పేరు యోగం కలుగుతాయి
ముఖ్యంగా ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. అందుకే షష్టి, మంగళవారం, గురువారం బాగా కలిసి వచ్చే రోజులు ఈ రోజుల్లో మంగళవారం కుజుడికి గురువారం గురు మంత్రాలు జపాలు చేయడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి