Unknown Facts About Holi Festival: హిరణ్య కశ్యపుడుకి హోలీ పండగకి సంబంధమేంటి.. ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు..
Unknown Facts About Holi Festival: పురాణాల ప్రకారం హోలీ పండగకి ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ పండగను కులమత బేధం లేకుండా జరుపుకుంటారు. కాబట్టి సామాజిక సామరస్యంగా చెప్పుకుంటారు. ఈ పండగకి పురాణాల్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Unknown Facts About Holi Festival: భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలు హోలీ పండగ ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండగని కులమత బేధాలు లేకుండా ఎంతో ఆనందంగా ప్రతి ఒక్కరూ ఈ పండగను జరుపుకుంటారు. అయితే హోలీ పండుగను జరుపుకోవడం పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఈ పండగకి ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా తెలంగాణలో నైతే కొన్ని జిల్లాల్లో హోలీ పండగ ముందు రోజే కాముడును దహనం చేసి పండగను జరుపుకోవడం పూర్వికుల నుంచి ఒక ఆనవాయితీగా వస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ గురించి అందరూ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను ఈరోజు మేము మీతో పంచుకోబోతున్నాం. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హోలీ పండగ ప్రాముఖ్యత:
చెడుపై మంచి విజయం:
హోలీ పండగ ప్రహ్లాదుడు అనే చిన్న పిల్లవాడు రాక్షసుడు హిరణ్యకశిపుడి చేతిలో నుంచి ఎలా రక్షణ పొందాడో గుర్తు చేస్తుంది. హిరణ్యకశిపుడు తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువును పూజించకుండా శతవిధాలుగా ప్రయత్నించాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీమహావిష్ణువుని పై భక్తి, నమ్మకాన్ని వదిలేయలేక పోతాడు. చివరికి హిరణ్యకశిపుడు అగ్నిలోకి ప్రవేశించమని ప్రహ్లాదుని బలవంతం చేస్తాడు. కానీ శ్రీమహావిష్ణువు ఇదే సమయంలో అగ్ని రూపంలో అవతారం ఎత్తి అతన్ని కాపాడుతాడు. ఈ సంఘటనను గుర్తుచేసుకొని చెడుపై మంచి ఎల్లప్పుడూ గెలుస్తుందని హోలీ పండగను జరుపుకుంటారు.
వసంత కాలం రాక:
పురాణాల ప్రకారం ఈ హోలీ పండగ వసంతకాలం రాకను కూడా సూచిస్తుంది ఈ సమయం నుంచి సమయంలో మార్పులు రోజులో టైం పొడగింపులు మారుతాయి దీనికి కారణంగా రాత్రి సమయం తగ్గి సాయంత్రం ఉదయం సమయం పెరుగుతుంది. అలాగే చెట్లకు చిగురు పెరిగి పూలు కూడా పూస్తాయి. అంతేకాకుండా ప్రకృతిలో కూడా అనేక మార్పులు జరుగుతాయి. ఇదంతా హోలీ పండుగ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అందుకే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగను ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటారు.
సామాజిక సామరస్యం:
హోలీ పండగను సామాజిక సామరస్యంగా కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ పండగలు అన్ని వర్గాలకు చెందిన వారు ఒకచోటకు చేరుకొని ఎంతో ఆనందంగా ఒకరికొకరు రంగులను చల్లుకుంటారు. అలాగే ఒకరికొకరు మిఠాయిలను కూడా పంచుకుంటారు. ఈ పండగ వల్ల సామాజిక బంధం కూడా వలోపేతం అవుతుంది. కాబట్టి ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
హోలీ పండగ చరిత్ర:
హోలీ పండగ చాలా పురాతనమైనది. హిందూ మత గ్రంథాలలో ఈ పండగ గురించి అనేకచోట్ల ప్రస్తావించారు. హోలీ పండగ గురించి అనేక కథలు ఉన్నాయి. ఒక కథ ప్రకారం..ఈ పండగ రాక్షసుడు హిరణ్యకశిపుడి సోదరి హోలిక మరణాన్ని గుర్తు చేస్తుంది. హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదుని చంపాలని హోలికను పంపిస్తాడు. కానీ చివరికి హోలికే అగ్నికి ఆహుతి అవుతుంది. ఈ సమయంలో ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడి ఎప్పటిలాగా ఆనందమైన జీవితాన్ని పొందుతాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి