Vaikunta Ekadasi 2022: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ద్వార దర్శనం.. ఉపవాస సమయ, నియమాలు ఇవే!!
వైకుంఠ ఏకాదశి తిథి జనవరి 12న సాయంత్రం 04:49 గంటలకు ప్రారంభమవుతుంది. దృక్‌పంచాంగ్ ప్రకారం జనవరి 13న రాత్రి 07:32 గంటలకు ముగుస్తుంది.
Vaikunta Ekadasi 2022: తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్ (AP), తెలంగాణ (Telangana)లలో ముక్కోటి ఏకాదశి (Vaikunta Ekadasi) వేడుకలు ఘనంగా ఆరంభం అయ్యాయి. ఇరు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. కరోనా వైరస్ (Covid 19) మహమ్మారి రూల్స్ పాటిస్తూ పలు ఆలయాల్లో దర్శనాలు కొనసాగుతున్నాయి. మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా తెలుగు రాష్ట్రాలలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. దాంతో కొన్ని ఆలయాలు వైకుంఠ ద్వార దర్శనాలు రద్దు చేశాయి.
తిరుమలలో బుధవారం అర్ధరాత్రి 12.05 నిమిషాలకు స్వామివారి వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. ఆలయంలో అర్చకులు ధనుర్మాస పూజలు నిర్వహించిన అనంతరం 1.45 నుంచి స్వామివారి దర్శనం ఆరంభం అయింది. బుధవారమే తిరుమల చేరుకున్న సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు చాలా మంది ప్రముఖులు ఆలయానికి రానున్నారు. వారి దర్శనం అనంతరం ప్రజలను అనుమతించనున్నారు.
Also Read: TS RTC bus points : సంక్రాంతి స్పెషల్ బస్సులు నిలిచే పాయింట్స్ ఇవే..
ఏకాదశి తిథి జనవరి 12న సాయంత్రం 04:49 గంటలకు ప్రారంభమవుతుంది. దృక్‌పంచాంగ్ ప్రకారం జనవరి 13న రాత్రి 07:32 గంటలకు ముగుస్తుంది. వైకుంట ఏకాదశి నాడు ఉపవాసం ఉండే భక్తులకు జనవరి 14వ తేదీ ఉదయం 06:37 నుండి 08:54 వరకు పారణ సమయం (ఉపవాస విరమణ) ఉంటుంది. వైకుంఠ ఏకాదశిలో ఉపవాసం ఒక ముఖ్యమైన అంశం. భక్తులు రోజంతా ఉపవాసం ఉండి జాగారం చేస్తారు. అన్నంతో చేసిన ఏదైనా పదార్థాలు..ఉల్లి, వెల్లుల్లి మరియు మాంసాహారాలు హిందూ గృహాలలో నిషేధించబడతాయి.
ప్రతి నెలా ఏకాదశి శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన రోజు. అందుకే ఏకాదశిని 'హరివాసరం'గా కొనియాడతారు. ఇక ధనుర్మాస ఏకాదశి స్వామివారికి మరింత ప్రీతికరం. భక్తజనావళికి శుభప్రదం. రావణుడు పెట్టే బాధలు పడలేక దేవతలు చతుర్ముఖ బ్రహ్మను ఆశ్రయించారు. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలంతా వైకుంఠం చేరుకున్నారు. ఆ హరివాసరం దగ్గర దేవతలు తమ విన్నపాలు వినిపించేందుకు వేచి ఉన్నారు. వేదసూక్తాలతో శ్రీహరిని స్తుతించగా లక్ష్మీనాథుని దర్శనభాగ్యం కలిగింది.
కలియుగ వైకుంఠమైన ఏడు కొండలపై (TTD) శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi 2022) మహావైభవంగా నిర్వహిస్తారు. ఆ ముందు రోజు (దశమి నాటి రాత్రి ఏకాంత సేవ) అనంతరం బంగారు వాకిళ్లు మూసేస్తారు. మరుసటి రోజు తెల్లవారు జామున (వైకుంఠ ఏకాదశి సుప్రభాతం) మొదలుకొని ద్వాదశి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న ముక్కోటి ప్రదక్షిణ మార్గాన్ని (ఉత్తర ద్వారాన్ని తెరచి) ఉంచుతారు. ఈ ఏకాదశి, ద్వాదశి రెండు రోజులూ శ్రీహరి దర్శనానంతరం భక్తులు ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళతారు. ఈ ప్రవేశ ద్వారాన్ని వైకుంఠ ద్వారమనీ, ఆ మార్గాన్నే వైకుంఠ ప్రదక్షిణమనీ పిలుస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook