Ram Charan reacts on RRR movie release postponed : ఆర్ఆర్ఆర్ మూవీ కోసం యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన తరుణంలో ఆ మూవీ విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. రామ్‌చరణ్, (Ram Charan) ఎన్టీఆర్ (NTR) హీరోలుగా.. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ఫైనల్‌గా జనవరి 7న రిలీజ్ అవుతుందన్నారు అందరూ. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్‌ను వాయిదా (RRR movie release postponed) వేసింది మూవీ యూనిట్. కోవిడ్ విజృంభనతో దేశంలో పలు రాష్ట్రాల్లో థియేటర్లు (Theaters) మూత పడటం వల్ల ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్‌ను వాయిదా వేయక తప్పలేదు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ పోస్ట్‌పోన్ కావడంపై తొలిసారి స్పందిచారు హీరో రామ్ చరణ్. (Hero Ram Charan)
దిల్ రాజు (Dil Raju) సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా తెరకెక్కిన రౌడీ బాయ్స్ (Rowdy Boys) మూవీ తాజా ఈవెంట్‌కు రామ్ చరణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. రౌడీ బాయ్స్ సంక్రాంతి బరిలోకి వస్తోంది. జనవరి 14న ఈ మూవీ రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన మ్యూజికల్ నైట్ (Musical Night) ఈవెంట్‌కు రామ్ చరణ్ హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read : Krithi Shetty Photos: అందమైన కుందనాల బొమ్మ.. ఈ కన్నడ ముద్దుగుమ్మ
సంక్రాంతికి (Sankranti) తమ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా రాకపోయినా తమకు ఏమీ బాధలేదన్నాడు రామ్ చరణ్. మూడున్నరేళ్లు కష్టపడి చేసిన సినిమా కరెక్ట్ సమయంలో రావాలి అని పేర్కొన్నారు. పెద్దలు ఉన్నారు వాళ్లే ఈ విషయాన్ని డిసైడ్ చేస్తారని చెప్పుకొచ్చారు చెర్రీ. రాజమౌళి, (Rajamouli) దానయ్య ఆ విషయాలు చూసుకుంటారన్నారు.
అయితే తమకు సంక్రాంతి ఎంత ముఖ్యమో తెలియదు కానీ సంక్రాంతి (Sankranti) మాత్రం దిల్ రాజుని (Dil RaJ) వదులుకోదని చెప్పుకొచ్చారు. ఈ సంక్రాంతి కూడా వాళ్లదే అవ్వాలని తాను కోరుకుంటున్నా అని పేర్కొన్నారు చరణ్. (Ram Charan)
Also Read : Shehnaaz gill : బ్లాక్ కలర్ అవుట్ ఫిట్‌తో గ్లామర్ ప్రదర్శిస్తున్న షెహనాజ్ గిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook