Vaisakha Purnima 2022: రేపు తొలి చంద్ర గ్రహణంతో పాటు వైశాఖ పౌర్ణిమ కూడా. బుద్ధ పూర్ణిమ అని కూడా అంటారు. అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు ఆ పని చేస్తే..ఇక సంపదే సంపద వచ్చి పడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైశాఖ పౌర్ణిమకు హిందూమతంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. అతి పవిత్రమైన రోజుగా భావిస్తారు. రేపు అంటే మే 16వ తేదీన ఈ ఏడాదిలో తొలి చంద్ర గ్రహణంతో పాటు వైశాఖ పూర్ణిమ కూడా. వైశాఖ పౌర్ణిమ నాడు రోజంతా విష్ణు భగవానుడు గౌతమ బుద్ధుని రూపంలో అవతరిస్తాడు. ఆయనే బౌద్ధ ధర్మాన్ని స్థాపించి..మొత్తం ప్రపంచానికి శాంతి, ప్రేమ, నిజాయితీ, మానవత్వపు సందేశాన్ని అందిస్తారు. ఇదే రోజున బౌద్ధునికి బౌద్ధగయాలో బోధి వృక్షం కింద బుద్ధిత్వం ప్రాప్తిస్తుంది. అందుకే బౌద్ధ పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. 


వైశాఖ పౌర్ణిమకు పూజ ఎలా చేయాలి


వైశాఖ పౌర్ణిమ నాడు సూర్యోదయం కంటే ముందగు స్నానమాచరించాలి. వాస్తవానికి వైశాఖ పౌర్ణిమ నాడు పవిత్రమైన నదుల్లో స్నానాలు చేయాలి. ఇది సాధ్యం కాకపోతే..గంగాజలం లభిస్తే..ఆ నీటితో ఇంట్లోనే స్నానం చేయాల్సి ఉంటుంది.  ఆ తరువాత ఎరుపు లేదా తెలుపు లేదా పసుపు వస్త్రం పరిచి..దానిపై విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి విగ్రహాలు లేదా ఫోటోలు ప్రతిష్టించాలి. ఆ తరువాత ప్రత్యేక పూజలు చేయాలి. చందనం, అక్షింతలు, పంచామృతం, పండ్లు, పూలు, కుంకుమ, కేసరి, కొబ్బరి వంటివి సమర్పించాలి. తులసి ఆకులు నైవేద్యంగా పెట్టాలి. హారతి ఇవ్వాలి. పూజాది కార్యక్రమాల అనంతరం..దానాలు చేయాలి. వైశాఖ పౌర్ణిమ నాడు నీళ్లతో నిండిన కుండ, చెప్పులు, సత్తువ, వంటలు, పండ్లు, ఫ్యాన్‌లు దానం చేయడం మంచిదని భావిస్తారు. 


సంపద ప్రాప్తించాలంటే ఏం చేయాలి


పితృదోషం, శనిదోషం సమస్యలతో ఉంటే..వైశాఖ పౌర్ణిమ చాలా ప్రత్యేకం.  ఆ రోజు రావిచెట్టుకు నల్ల నువ్వులు కలిపిన నీటిని అభిషేకం చేయాలి. దాంతో పితృదోషం పోతుంది. అటు రావిచెట్టుకు పూజ చేయడం ద్వారా శనిదోషం తగ్గుతుంది. ఇలా చేయడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అని సమస్యలు, బాధలు దూరమౌతాయి. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. అభివృద్ధి, సంపద ప్రాప్తిస్తాయి. ఉదయం స్నానం చేసి రావి చెట్టు వద్ద పాలు, నీరు అభిషేకిస్తే..అన్ని కోరికలు నెరవేరుతాయి. 


Also read: Chandragrahanam 2022: ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ప్రభావం ఆ రాశులపై అంత బాగుంటుందా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.