హిందూ పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్షం పంచమ తిధి నాడు వచ్చేదే వసంత పంచమి. ఈ రోజున చదువుల తల్లి సరస్వతిని పూజించడం ఆనవాయితీ. సరస్వతి పుట్టినరోజు కాబట్టే ఈ రోజు ఆమెకు అర్పితం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఇదే రోజు వసంత రుతువు ప్రారంభమౌతుంది. అందుకే వసంత పంచమిగా పిలుస్తారు. ఈ ఏడాది జనవరి 26వ తేదీ గురువారం నాడు వసంత పంచమి ఉంది. వసంత పంచమి నాడు కొన్ని ప్రత్యేకమైన వస్తువుల్ని ఇంటికి తీసుకురావడం అత్యంత శుభ సూచకంగా భావిస్తారు. పెళ్లిళ్లకు అద్భుతమైన ముహూర్తం కూడా. 


వసంత పంచమి నాడు ఈ వస్తువులు కొంటే అంతా శుభమే


పుస్తకం


వసంత పంచమి నాడు ఏదైనా మంచి పుస్తకాన్ని ఇంటికి తీసుకురండి. సరస్వతి దేవి చదువుకు, జ్ఞానానికి దేవత. ఆమె పుట్టిన రోజున పుస్తకం లేదా గ్రంథం కొనడం చాలా మంచిది.


పెళ్లి సంబంధిత వస్తువులు


హిందూమతం ప్రకారం వసంత పంచమి నాడు శివుడు, పార్వతి దేవిలో తిలకోత్సవం జరిగింది. అందుకే ఈ రోజు పెళ్లి అంటే చాలా చాలా మంచి ముహూర్తం. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేవాళ్లు లేదా యువతీ యువకులు ఎవరైనా సరే పెళ్లెప్పుడు చేసుకోవాలో నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో ఉంటే వసంత పంచమి మంచి ముహూర్తం అవుతుంది. ఆ రోజున పెళ్లికి సంబంధించిన కొన్ని వస్తువులు ఉదాహరణకు పెళ్లి బట్టలు, నగలు, శోభనం వస్తువులను కొనడం చాలా మంచిది. వసంత పంచమి నాడు  ఈ వస్తువుల్ని కొనడం వల్ల సౌభాగ్యంలో వృద్ధి లభిస్తుంది.


పసుపు రంగు పూల దండ


సరస్వతి దేవికి పసుపు రంగు చాలా ఇష్టం. ఈ రోజున పసుపు రంగు బట్టలు ధరించడం శుభంగా భావిస్తారు. వసంత పంచమి నాడు పసుపు రంగు పూల దండ పార్వతీ దేవికి సమర్పించాలి. ఇంటి ప్రదాన గుమ్మం వద్ద పసుపు రంగు పూలు అలంకరించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సమృద్ధి లభిస్తుంది.


నెమలి పింఛం మొక్క


నెమలి పింఛం మొక్క సరస్వతి దేవికి చాలా ప్రియమైంది. ఏ ఇంట్లో నెమలి పింఛం మొక్క ఉంటుందో ఆ ఇంట్లో పిల్లలు చదువులా బాగా రాణిస్తారు. వసంత పంచమి నాడు మీ ఇంట్లో నెమలి పింఛం మొక్కను ఇంటి ప్రధాన గుమ్మం లేదా డ్రాయింగ్ రూమ్‌లో పెట్టండి.


వాద్య పరికరం


సరస్వతి దేవి అంటే కళ, సంగీతానికి ప్రతీక. వసంత పంచమి నాడు మీరు ఏదైనా చిన్న వాద్య పరికరం కొంటే చాలా మంచిది. కళ, సంగీత శిక్షణ కోసం వాద్య పరికరం కొనాలని ఉంటే ఈ రోజు వరకూ నిరీక్షించండి.


సరస్వతి దేవి చిత్రం లేదా విగ్రహం


వసంత పంచమి నాడు ఇంట్లో సరస్వతి దేవి చిత్రం లేదా విగ్రహాన్ని తీసుకొచ్చి ఈశాన్య దిశలో ఉంచాలి. ఫలితంగా పిల్లల చదువుపై పాజిటివ్ ప్రభావం పడుతుంది. 


వాహనం


వసంత పంచమి నాడు కొత్త ఇళ్లు లేదా కొత్త వాహనం కొనడం అత్యంత శుభసూచకం. ఈ రోజున తీసుకునే వస్తువులు దీర్ఘకాలంపాటు పనిచేస్తాయి. సుఖ సమృద్ధిని ప్రసాదిస్తాయి.


Also read: Venus Transit 2023: ఇవాళ్టి నుంచి 23 రోజుల వరకూ ఆ 5 రాశులపై కనకవర్షమే, ఊహించని డబ్బు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook