Vasant Panchami 2024: వసంత పంచమి తేది, శభ సమాయాలు, చేయాల్సిన పనులు, చేయకూడని పనులు..
Vasant Panchami 2024 In Telugu: ప్రతి సంవత్సరం వసంత పంచమిని మాఘ మాసంలో జరుపుకుంటారు. ఈ రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ పంచమి రోజు తప్పకుండా ఈ కింది పనులు చేయకూడదు.
Vasant Panchami 2024 In Telugu: ఈ సంవత్సరం వసంత పంచమి ఫిబ్రవరి 14 బుధవారం వచ్చింది. ఈ రోజుకి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం ఈ వసంత పంచమిని మాఘ మాసంలో జరుపుకుంటారు. ఈ రోజు శుభ సమయం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమై ఉ.10కు ముగుస్తుంది. దుర్ముహూర్తం ఉదయం 11 నుంచి ప్రారంభమై 12లకు ముగుస్తుంది. ఇక అమృత ఘడియల విషయానికొస్తే, మధ్యహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 3.54 వరకు ఉంటుంది.
ఈ సంవత్సరం 13వ తేదీ మధ్యాహ్నం 2:41 గంటలకు పంచమి తిథి ప్రవేశించబోతోంది. అందుకే ఆ తర్వాత రోజు బుధవారం ఉదయ తిథిలో సరస్వతీ పూజలు నిర్వహించడం శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రోజు(ఫిబ్రవరి 14వ తేదీ) మధ్యాహ్నం 12.10 గంటలకు మాత్రమే పంచమి తిథి ఏర్పడబోతోంది. దీంతో ఈ సమయంలో శుభ, శుక్ల యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. కాబట్టి ఈ సమయంలో సరస్వతీ దేవిని పూజించడం చాలా శుభప్రదమని నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మంచి ఈ సమయంలో కొన్ని చేయకూడని పనులు కూడా చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వసంత పంచమి రోజు చేయాల్సిన పనులు:
✽ వసంత పంచమి రోజు పితృ తర్పణం చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
✽ ఈ రోజు బ్రహ్మచర్యం పాటించడం చాలా శుభప్రదం.
✽ ఈ పంచమి రోజు తప్పకుండా స్నానం చేసిన తర్వాతే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
✽ ఈ రోజు మాత్రం అరచేతులను చూసి రోజువారి జీవితాన్ని ప్రారంభించాలని ఆనవాయిగా వస్తోంది.
✽ వతసంత పంచమి రోజున తప్పకుండా సరస్వతీమాతను ధ్యానించాలి.
✽ వీలైతే పసుపు రంగు దుస్తువులను ధరించాల్సి ఉంటుంది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
వసంత పంచమి రోజు చేయకూడని పనులు:
✽ వసంత పంచమి రోజు స్నానం చేయకుంగా ఉండ కూడదు.
✽ ఇతరులతో దుర్భాషలాడం, జీవిత భాగస్వామితో గొడవలు పెట్టుకోవడం మానుకోవాలి.
✽ ఈ రోజు ఎట్టిపరిస్థితుల్లోనూ మాంసం లేదా మద్యం సేవించవద్దు.
✽ ఈ వసంత పంచమి రోజు చెట్లను నరకడం మంచిది కాదు.
✽ వతసం పంచమి రోజు రోడ్లపై ఉన్న జంతువులను కూడా కొట్టకూడదు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter