హిందూమంతంలో తాబేలును అత్యంత పవిత్రంగా భావిస్తారు. తాబేలును విష్ణువు అవతారంగా భావిస్తారు. తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల సుఖ సంతోషాలతో పాటు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. సముద్ర మథనం ద్వారా తాబేలు పుట్టిందని..అందుకే అంతటి మహత్యమంటారు. వాస్తు, ఫేంగ్‌షుయీలో తాబేలు బొమ్మను శుభంగా భావిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రిస్టల్ తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల వాస్తుదోషం దూరమౌతుంది. విష్ణు భగవానుడి భార్య లక్ష్మీదేవి ఇంట్లో నివాసముంటుందని ప్రతీతి. అంతేకాదు..ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుందని చెబుతారు. ఇంట్లో ధన ధాన్యాలు లభిస్తాయి. ఏ విధమైన వాస్తు దోషం లేదా ఆరోగ్య సంబంధిత సమస్యలు లేదా ధనలాభం కోసం  ఇంట్లో క్రిస్టల్ తాబేలు ఉంచాలనే సలహా ఇస్తుంటారు. 


క్రిస్టల్ తాబేలుతో లాభాలు


వాస్తు పండితుల ప్రకారం ఎవరికైనా ఆర్ధిక సంబంధ సమస్యలుంటే..ఇంట్లో క్రిస్టల్ తాబేలు ఉంచాలి. ఇంట్లో క్రిస్టల్ తాబేలు ఉంచడం వల్ల కుటుంబీకుల ఆయువు పెరుగుుతంది. దాంతోపాటు అన్ని రకాల వ్యాధుల్నించి విముక్తి కలుగుతుంది. 


స్ఫటికపు తాబేలును ఇంట్లో ఉంచడం అత్యంత శుభసూచకంగా భావిస్తారు. ఒకవేళ ఎవరికైనా ఉద్యోగం లేకపోతే..ఇంట్లో క్రిస్టల్ తాబేలు ఉంచాలంటారు. దీనివల్ల ఆ వ్యక్తికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అటు ఉద్యోగంలో మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. సౌభాగ్యం కోసం ఆఫీస్ లేదా బెడ్రూంలో కూడా ఉంచవచ్చు. తద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. 


క్రిస్టల్ తాబేలును ఉంటే నియమాలు


వాస్తుశాస్త్రం ప్రకారం క్రిస్టల్ తాబేలును ఉంచడం శుభ పరిణామాల్ని కల్గిస్తుంది. సరైన దిశలో సరైన స్థానంలో ఉంచాల్సి ఉంటుంది. తాబేలు చాలా శాంత స్వభావి. అందుకే ఇంట్లో ఉంచడం వల్ల శాంతి వాతావరణం ఏర్పడుతుంది. ఈ నియమాలను సరిగ్గా పాటిస్తే ,తాబేలు మీకు అదృష్టంగా మారుతుంది. ఇది ఓ రకమైన ప్రభావశాలి యంత్రం. ఇంట్లో వాస్తు దోషాన్ని దూరం చేస్తుంది. 


Also read: Mahashivratri 2023: మహా శివరాత్రి ఈ 5 రాశులపై కనకవర్షం కురిపించడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook