Vastu Plant For Lord Shiva: మొక్కలకు హిందూమతంలో గౌరవప్రదమైన స్థానం ఉంది. కొన్ని వృక్షాలలో దేవతలు కొలువుదీరి ఉంటారని హిందూవులు నమ్ముతారు. తల్లి లక్ష్మి తులసి మొక్కలో నివసిస్తుంది. అదే సమయంలో, త్రిమూర్తులు పీపాల్ ప్లాంట్‌లో నివసిస్తారని విశ్వాసం. దీంతో పాటు దేవతలు.. మర్రి చెట్టు, శమీ మొక్క, అరటి చెట్టు మరియు నల్ల డాతురా మొక్కలో కూడా కొలువుదీరి ఉంటారని భక్తుల నమ్మకం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మతపరమైన దృక్కోణంలో.. ఈ మొక్కలను ఇంట్లో సరైన దిశలో ఉంచి, వాటిని క్రమం తప్పకుండా పూజలు చేస్తే, ఆ ఇంట్లో దేవుని అనుగ్రహం ఉంటుంది. శివుని (Lord Shiva) అనుగ్రహం పొందడానికి.. జ్యోతిషశాస్త్రంలో నల్ల ధాతురా (Black Dhatura Plant) మొక్క గురించి చెప్పబడింది. దీన్ని ఇంట్లో పెట్టుకుని నిత్య పూజలు చేస్తే భోళాశంకరుని అనుగ్రహం లభిస్తుంది. దీన్ని ఏ రోజున మనం ఇంట్లో పెట్టుకోవాలో చూద్దాం.  


ఈ రోజున నల్ల దాతురాను నాటండి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో నల్ల ధాతురా మొక్కను నాటడం ఎంతో మంచిది. దీని వల్ల  ఇంట్లో ఆనందం, శ్రేయస్సు మరియు డబ్బు రాక ఉంటుంది. ఇంట్లో నల్ల దాతురా మెుక్కను ఆదివారం లేదా మంగళవారం నాటడం ఎంతో ఉత్తమం. ఈ మెుక్కను పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పోతుంది. 


శివుడికి ఎంతో ఇష్టమైన మెుక్క
డాతురా శివునికి చాలా ప్రీతికరమైన మెుక్క. అందువల్ల శివారాధన సమయంలో శివలింగంపై ధాతురా సమర్పిస్తారు. బ్లాక్ డాతురా (ఉమ్మెత్తు మెుక్క) మొక్క సాధారణ డాతురా మాదిరిగానే ఉంటుంది. కానీ దాని పువ్వులు తెలుపు రంగులో కాకుండా ముదురు ఊదా రంగులో ఉంటాయి. అలాగే ఆకులలో నల్లబడటం కూడా ఉంటుంది. అందుకే దీనిని 'బ్లాక్ డాతురా' అంటారు. 


Also Read: Gayatri Jayanti 2022: గాయత్రి జయంతి తేదీ.. ప్రాముఖ్యత.. ఆరోజు పఠించాల్సిన గాయత్రి హారతి...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook