Vastu Tips for kids Room: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో..వాస్తు శాస్త్రానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఇల్లనేది ఎలా ఉండాలి, ఏ రంగులుంటే మంచిది ఇలా చాలా వివరాలున్నాయి వాస్తులో. మరి మీ ఇంటికి ఏ ఐదు రంగులు బాగుంటాయో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సొంత ఇళ్లు అనేది ప్రతి ఒక్కరి కల. స్థోమతను బట్టి ఇంటి నిర్మాణముంటుంది. కానీ అందరూ ఫాలో అయ్యేది మాత్రం వాస్తు శాస్త్రాన్నే. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం ఎలా ఉండాలనేదే కాదు..ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుండాలి ఏ రంగులైతే వాస్తు ప్రకారం బాగుంటుంది ఇలా చాలా వివరాలున్నాయి. ప్రస్తుతం మనం మీ ఇంట్లో చిల్డ్రన్ రూమ్‌కు ఏ ఐదు రంగులు బాగుంటాయనేది తెలుసుకోవాలి.


ఇంట్లో చిన్నారులు ఎక్కువగా టైమ్ స్పెండ్ చేసేది చిల్డ్రన్ రూమ్స్‌లోనే. హోమ్‌వర్క్ లేదా గేమ్స్ లేదా పడుకోవడం ఇలా ఏదో ఒక రూపంలో ఎక్కువ టైమ్ వారి రూమ్స్‌లోనే ఉంటుంటారు. ఎందుకంటే చిల్డ్రన్ రూమ్స్‌లో పిల్లలు ఆనందంగా ఉండటమే కాకుండా..స్పేస్ లభిస్తుంది. అందుకే మీ పిల్లల రూమ్స్‌లో రంగులు కూడా వాస్తు ప్రకారం ఉంటే ఇంకా మంచి ఫలితాలుంటాయి. మీ పిల్లల గదులకు బాగుండే 5 రంగులు గురించి తెలుసుకుందాం..మీ పిల్లల మనస్తత్వాన్ని బట్టి రూమ్ కలర్ ఉండాలని వాస్తు శాస్త్రం వివరిస్తోంది. 


బ్లూ కలర్


మీ పిల్లలు హైపర్ యాక్టివ్‌గా ఉంటే బ్లూ కలర్ మంచిది. వాస్తు ప్రకారం కొన్ని రంగులకు ప్రశాంతపర్చే స్వభావముండి..గదిలోని ఎనర్జీని మారుస్తాయి. అదే గదిలో కిటికీ ఉత్తరం వైపుంటే బ్లూ కలర్ వద్దని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. 


గ్రీన్ కలర్


మీ పిల్లవాడు చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతుంటే...గ్రీన్ కలర్ మంచి ప్రత్యామ్నాయం. ఎందుకంటే ఆకుపచ్చ రంగు ప్రకృతి రంగు. మన చుట్టూ ఉండే ప్రకృతిలో ఎక్కువగా కన్పించే రంగు అదే. దీనివల్ల ఏకాగ్రత లభిస్తుంది. 


ఎల్లో కలర్


వాస్తు శాస్త్రం ప్రకారం ఎల్లో వంటి మృదువైన రంగులు పిల్లలకు మంచివి. ఇవి మీ పిల్లల మూడ్ స్వింగ్ బ్యాలెన్స్ చేస్తూ..బిహేవియర్ మెరుగుపరుస్తాయి. మీ పిల్లలకు మంచి జరగాలంటే ఎల్లో కలర్ ఉండాలని వాస్తు సూచిస్తోంది. 


పర్పుల్ కలర్


చిల్డ్రన్ రూమ్ పర్పుల్ కలర్‌లో ఉండటమంటే అంతకుమించిన బెస్ట్ వాస్తు మరొకటి లేదనే అంటారు. చుట్టూ వాతావరణంలో ప్రశాంతతను తీసుకొస్తుంది. మీ పిల్లల రిలాక్స్ అయ్యేందుకు సహకరిస్తుంది. మీ పిల్లల నిద్రతీరును కూడా మెరుగుపరుస్తుంది. 


పింక్ కలర్


సింప్లిసిటీ, డిలైట్‌నెస్ గురించి మాట్లాడుకుంటే...పింక్ అద్భుతమైన రంగనడంలో సందేహం లేదు. పింక్ అనేది అద్భుతమైన రంగే కాకుండా..శాంతం, శాంతిని ప్రతిబింబిస్తుంది. మీ పిల్లలు ప్రశాంతంగా ఉండాలంటే పింక్ కలర్ మంచిది. మీ పిల్లల మైండ్ ప్రశాంతంగా, రిలాక్స్డ్‌గా ఉండాలంటే పింక్ రంగు వాస్తు శాస్త్రం ప్రకారం మంచి ఎంపిక. 


Also read: Auspicious Things On Saturday: శనివారం వీటిలో ఏ ఒక్కటి కనిపించినా.. మీకు లాటరీ తగలడం పక్కా..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook