Vastu Tips: పోయిన అదృష్టం తిరిగి రావాలంటే ఈ వస్తువుల్ని ఇంటికి తీసుకురండి చాలు
Vastu Tips: మనిషి జీవితంలో వాస్తుశాస్త్రం అత్యంత మహత్యమైంది. ప్రముఖమైంది. వాస్తు నియమాల్ని తూచా తప్పకుండా ఆచరిస్తే అదృష్టం మిమ్మల్ని తట్టి లేపుతుంది. పెద్దఎత్తున ధనవర్షం కలుగుతుంది.
ఇంట్లో వాస్తుదోషముంటే మనిషి ఎంతగా కష్టపడినా ప్రతిఫలం ఉండదు. ఇంట్లో అశాంతి నెలకొంటుంది. ధనహాని కారణంగా ఆర్ధిక ఇబ్బందులు వెంటాడుతుంటాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని పద్ధతులు పాటిస్తే అన్ని సమస్యల్నించి విముక్తి పొందవచ్చు.
వాస్తుదోషం నుంచి విముక్తి పొందాలంటే ఇంట్లో కొన్ని వస్తువులు అమర్చుకోవాలి. వీటివల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ శక్తి దూరమౌతంది. నెమ్మది నెమ్మదిగా అదృష్టం వికసిస్తుంది.
తులసి-అరటి మొక్కలు
హిందూమతంలో తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఇందులో లక్ష్మీదేవి ఆవాసముంటుందని ప్రతీతి. అటు అరటి మొక్కలకు కూడా విశేష ప్రాధాన్యత ఉంది. ఇంట్లో లేదా ఇంటి సమీపంలో ఈ రెండు మొక్కలు అమర్చుకుంటే విష్ణువు, లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని ప్రతీతి.
క్రిస్టల్ బాల్
వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో క్రిస్టల్ బంతి ఉంచడం వల్ల చాలా శుభం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో క్రిస్టల్ బంతి తెచ్చుకుని గాలి వెలుతురు ధారాళంగా ప్రసరించే చోట అమర్చుకోవాలి. క్రిస్టల్ బంతి అన్నివైపులా ఉన్న నెగెటివ్ శక్తిని దూరం చేస్తుంది.
మట్టి గిన్నె
వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి కప్పుపై ఈశాన్య కోణంలో నీళ్లతో నిండిన మట్టి గిన్నె ఉంచాలి. ఈశాన్య కోణం శివుడికి మూలస్థానం. నీళ్లతో నింపిన మట్టి గిన్నె ఉంచితే పక్షులు నీళ్లు తాగగలగుతాయి. అంతే మీరు చూస్తుండగానే అదృష్టం వరిస్తుంది.
పూవులు
ఇంట్లో అందమైన పూవులు పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. మరోవైపు ఇంటి అందాన్ని కూడా పెంచుతాయి. ఇంటి ప్రధాన గుమ్మం లేదా కిటికీ వద్ద గులాబీ, చామంతి, బంతి, సంపెంగ వంటి పూల మొక్కలు పెట్టుకుంటే మంచిది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇది శుభసూచకం.
Also read: Sun Saturn Transit 2023: నెల రోజులు ఆ మూడు రాశులు సంయమనంగా ఉండాల్సిందే, లేకపోతే తీవ్ర ఇబ్బందులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook