Bedroom Vastu Tips: వాస్తు శాస్త్రంలో (Vastu Tips) ఇంట్లోని ప్రతి భాగానికి, ప్రతి మూలకు నియమాలు, జాగ్రత్తలు రూపొందించబడ్డాయి. వీటిని పాటిస్తే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. విజయం మీ దరి చేరుతుంది. ఇంట్లోని సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. భార్యాభర్తలు మంచి దాంపత్యాన్ని ఆనందిస్తారు. కానీ ఇంట్లో ఏదైనా వాస్తు దోషం తలెత్తితే, జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు వస్తాయి. అలాగే పడకగదిలో ఏదైనా వాస్తు దోషం తలెత్తితే భార్యాభర్తల మధ్య సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం, పడకగదిలో (Bedroom Vastu Tips) కొన్ని ప్రతికూల చిత్రాలు ఉండటం వల్ల చాలా నష్టం జరుగుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ చిత్రాలను పడకగదిలో పెట్టకండి:
** పడకగదిలో నది లేదా ప్రవహించే జలపాతాల్లాంటి ఫోటోలు ఎప్పుడూ ఉంచవద్దు. అలా చేయడం వల్ల సంబంధంపై నమ్మకం లోపిస్తుంది. అలాంటి చిత్రం ఒకదానికొకటి సందేహం లేదా అనుమానాన్ని కలిగిస్తుంది. అలాంటి పరిస్థితి భార్యాభర్తలకు మంచిది కాదు.
** పడకగదిలో ఎప్పుడూ దేవుళ్ళ ఫోటోలు పెట్టకండి. ఇది వాస్తు దోషాలను సృష్టిస్తుంది.
**  శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతా జ్ఞానాన్ని ప్రసాదించిన చిత్రం తప్ప, మహాభారత యుద్ధం యొక్క ఇతర చిత్రాలను ఇంట్లో ఎక్కడా ఉంచకూడదు. అదే సమయంలో మహాభారతం లేదా మరే ఇతర యుద్ధానికి సంబంధించిన చిత్రాలను పొరపాటున పడకగదిలో పెట్టకండి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య టెన్షన్ ఏర్పడుతుంది.
** పిల్లల సంతోషం కోసం ఎదురుచూసే దంపతులు పడకగదిలో పావురం బొమ్మను పెట్టకూడదు. 
** మంచం మీద పూర్వీకుల బొమ్మను కూడా పెట్టవద్దు. దీంతో భార్యాభర్తల మధ్య సంబంధాలు దూరమవుతాయి.
** పడకగదిలో సూర్యుడు అస్తమించే చిత్రాన్ని కూడా ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అనాసక్తి ఏర్పడుతుంది.


Also Read: Palmistry predictions: మీ అరచేతి ఆకారం, రంగు చూసి భవిష్యత్ తెలుసుకోవచ్చట!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి