Vastu Tips For Broom: ఇంట్లో శుభ్రత పాటించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆనారోగ్య భారిన పడకుండా కీటకాల నుంచి శుభ్రత రక్షిస్తుంది. ఇల్లును శుభ్రంగా ఉంచాలంటే ప్రతి రోజు క్రమం తప్పకుండా ఇంటిని ఊడ్చాలి. అయితే వాస్తు ప్రకారం ఇంటిని ఊడ్చేందుకు ప్రత్యేక సమయం ఉంటుంది. వాస్తులో చీపురుకు చాలా ప్రాముఖ్యత ఉంది. శాస్త్రంలో చిపురును లక్ష్మి దేవిగా భావిస్తారు. అయితే అనవసరంగా ఊడ్చడం వల్ల ఇంట్లో దరిద్రం వస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. వాస్తు శాస్త్రం సూచించిన సమయాల్లో మాత్రమే ఇంట్లో ఊడ్చుకోవాలి. ఆ సరైన సమయాలను తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాత్రి పూట చిపురుతో ఊడ్చుతే అశుభమేనా..?:


వాస్తు శాస్త్రం ప్రకారం.. రాత్రిపూట ఇంట్లో చీపురుతో ఊడ్చుకుంటే అశుభం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని ఇంట్లో దరిద్రం పెరుగుతుందని ప్రజలు నమ్ముతారు.


ఊడ్చుకోవడానికి సరైన సమయం ఏది..?:


ఒక రోజు మొత్తం నాలుగు సార్లు ఊడ్చుకోవచ్చని వాస్తు శాస్త్రంలో పేర్కొంది. ఇల్లు ఊడ్చుకోవడానికి సరైన సమయం ఉదయమేనని నిపుణులు తెలుపుతున్నారు. సాయంత్రం పూట ఇల్లును చిపురితో శుభ్రం చేయడం మంచిదికాదని సూచిస్తుంది.


చీపురు ఏ దిక్కులో ఉంచాలి?:


చీపురును సరైన దిశలో ఉంచడం కూడా చాలా ముఖ్యమని శాస్త్రం చెబుతోంది. చీపురు ఇంటికి పశ్చిమ దిశలో ఉంచాలని తెలిపింది. 



చీపురును పాదాలతో తొక్కకూడదు:


భారతీయులు చీపురులో లక్ష్మీ దేవి ఉందని నమ్ముతారు. అందుకే చీపురును పాదాలతో తొక్కకూడదని శాస్త్రం తెలిపింది. అలాగే చిపురుపై నుంచి దాటకూడదని కూడా పేర్కొంది.



(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read: Watermelon Benefits: పుచ్చకాయ తినే వారు తప్పకుండా ఈ విషయాలను తెలుసుకొండి..!!


Also Read: Lady Finger Benefits: ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో రక్త కొరతను తగ్గిస్తుంది.. మీరు కూడా తాగండి.!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.