Vastu Tips: ఉదయం లేవగానే ఈ 5 పనులు చేయవద్దు, లేకపోతే ఇంట్లో అంతా దారిద్య్రమే
Morning Vastu Dos and Don`ts: హిందూమతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్యానికి ఎంత విశిష్టత ఉందో అంత ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తు అంటే కేవలం ఇళ్లు ఎలా ఉండాలి, ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడుండాలనే కాదు..రోజూ ఏం చేయాలనేది కూడా ఉంటుంది.
Morning Vastu Dos and Don'ts: వాస్తు శాస్త్రంలో దైనందిన కార్యక్రమాల గురించి కూడా వివరణ సంపూర్ణంగా ఉంటుంది. ఉదయం ఏం చేయాలనే అంశాల గురించి ప్రస్తావన ఉంది. ఎలాంటి పనులు చేయకూడదనే సూచన ఉంది. ఇంట్లో దరిద్రం రాకుండా ఉండాలంటే ఎలాంటి పనులు చేయకూడదో సవివరంగా ఉంది.
జ్యోతిష్యం ప్రకారం జీవితంలో పైకి ఎదిగేందుకు, డబ్బులు సంపాదించేందుకు శ్రమతో పాటు వాస్తు సూచనలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఇవి పాటించకపోతే ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదంటారు. అందుకే చాలామంది ఉదయం లేవగానే ఏదైనా మంచి వస్తువు లేదా దృశ్యం చూడాలనుకుంటారు. అలా చేస్తే ఆ రోజంతా బాగుంటుందని నమ్ముతారు. అదే చెడు వస్తువులు, చెడు దృశ్యాలు చూస్తే ఆ రోజంతా చిరాగ్గా ఉంటుందని విశ్వసిస్తారు. వాస్తు శాస్త్రంలో ఉదయం లేవగానే ఏం చేయకుండా ఉంటే దరిద్రం ఉండదో వివరంగా ఉంది.
వాస్తు ప్రకారం ఉదయం వేళ అంటే నిద్ర నుంచి లేవగానే మీ నీడను మీరు చూడకూడదు. ఇది అశుభానికి ప్రతీక. దీనివల్ల ఇంట్లో గొడవలు జరిగే అవకాశాలున్నాయి. ఇక ఉదయం లేవగానే ఎవరినీ పల్లెత్తు మాటనకూడదు. ముఖ్యంగా తిట్టడం అనేది చేయకూడదు. లేకపోతే నెగెటివిటీ కారణంగా మొత్తం రోజంతా పాడయిపోతుంది. ఉదయం లేవగానే తల్లిదండ్రుల్ని నమస్కరించి దేవుడిని ప్రార్ధించాలి.
ఉదయం లేవగానే ఎంగిలి గిన్నెలు చూడకూడదు. దీనివల్ల చాలా నష్టం కలుగుతుంది. ఉదయం ఎంగిలి గిన్నెలు చూడటం వల్ల దౌర్భాగ్యం ఎదురౌతుందంటారు. ఆర్ధిక ఇబ్బందులు కూడా వెంటాడవచ్చు. అందుకే నిద్రపోయే ముందు ఇంట్లో గిన్నెలు శుభ్రం చేసుకుని ఉండాలి. కిచెన్ శుభ్రంగా ఉంచుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో లేదా పాతకాలం రోజుల్లో ఉదయం 5 గంటలకే లేచి పనులు ప్రారంభిస్తుంటారు. ఇది చాలా మంచి అలవాటు. ఆరోగ్యపరంగా కూడా మంచిది. ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదంటారు. ఆర్ధిక సమస్యలు చుట్టుముడుతాయి. వ్యాధులు కూడా తలెత్తవచ్చు.
ఇక వాస్తు శాస్త్రం ప్రకారం మరో ముఖ్యమైన సూచన ఉదయం లేవగానే అద్దంలో చూసుకోకూడదు. చాలామందికి ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకోవడం అలవాటు. ఇది మంచి అలవాటు కాదంటారు వాస్తు పండితులు. దీనివల్ల చేపట్టిన పనుల్లో విఘాతం కలుగుతుందట. పనులు సక్రమంగా పూర్తి కాకుండా ఆగిపోతాయి.
Also read: IRCTC Ooty Package: శీతాకాలంలో ఊటీ అందాలు ఆస్వాదించే అద్భుత ప్యాకేజ్ మీ కోసం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook