Vastu Tips: చాలామంది ఇళ్లలో వివిధ రకాల పెయింటింగ్స్, ఫోటోలు దర్శనమిస్తుంటాయి. కొన్ని పూర్వీకులవైతే కొన్ని సీనరీలు వంటివి ఉంటాయి. ఈ తరహా చిత్రాల గురించి కూడా వాస్తుశాస్త్రంలో సూచనలున్నాయి. వాస్తు ప్రకారం ఇంటి గోడలపై కొన్ని రకాల చిత్రాలు అమర్చకూడదంటారు. లేకపోతే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషి జీవితంలో ఫోటోలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఫోటోల ప్రభావం మనిషిపై చాలా ఉంటుంది. ఏదైనా భయంకర దృశ్యం చూసినా లేదా ఆహ్లాదకర దృశ్యం చూసినా ఆ ప్రభావం చాలాసేపటి వరకూ నిలిచుంటుంది. ఆహ్లాదకర దృశ్యాలు చూస్తే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. ఫోటోలు లేదా దృశ్యాలకు ఉండే విశిష్టత అలాంటిది. మస్తిష్కంపై చెరగని ముద్ర వేస్తుంటాయి. కంటితో చూసే ప్రతి వస్తువు ప్రభావం ఉంటుంది. అందుకే వాస్తు ప్రకారం కొన్ని రకాల చిత్రాలు ఇంట్లో గోడలపై ఉండకూడదని సూచిస్తుంటారు వాస్తు పండితులు. 


ఫోటోలకు మనిషి జీవితంలో చాలా మహత్యముంది. మనసుపై లోతైన ప్రభావం చూపిస్తుంటాయి. అది భయానకమైనా, ఆహ్లాదమైనా ఫోటోను బట్టి ప్రభావం ఉంటుంది. అందుకే పాతకాలంలో ఇంటి గోడలపై చిత్రాలు చెక్కించేవారు. ఇంట్లో శుభ కార్యాలు, దేవుడి చిత్రాలకు ప్రాధాన్యత కల్పించేవారు. పెళ్లి, యజ్ఞ యాగాలు, తీర్ధస్థలాలు, పర్యాటక ప్రాంతాల విశేషాలను గోడలపై అత్యంత అందంగా చెక్కించేవారు. పెయింటింగ్స్ వేసేవారు. అందమైన, మంచి చిత్రాలు అక్కడి వాతావరణాన్ని అందంగా మారుస్తాయి.


మంచి చిత్రాలు ఎప్పుడూ మస్తిష్కంపై మంచి ప్రభావాన్నే కల్గిస్తాయి. అందుకే ఇంట్లో డ్రాయింగ్ రూమ్, బెడ్రూం లేదా పూజ మందిరాల్లో ఎక్కడైనా సరే భయం కల్గించేవి, బాధ కల్గించే చిత్రాలు లేదా ఫోటోలు ఉంచకూడదు. వికృతమైనవి, భయానకమైనవి, రంగుల్లేకుండా ఉండేవి, ఏదైనా దుర్ఘటనకు సంబంధించిన పాత ఫోటోలు గోడలపై పొరపాటున కూడా అమర్చకూడదు. జ్యోతిష్య గ్రంధాల్లో కూడా ఈ విషయం ప్రస్తావించారు. బీభత్సానికి సంబంధించిన ఫోటోలు, పోస్టర్లు, నగ్న, అశ్లీల చిత్రాలు, మాంసం తినే కుక్కలు, పాములు, పులులు వంటి జంతుజీవాల ఫోటోలను గోడలపై ఉంచడాన్ని నిషేధించారు. 


Also read: Money Horoscope: ఈ రాశులవారిపై 2024లో లక్ష్మీదేవి అనుగ్రహం..అదృష్టం వరించబోతోంది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook