Vastu tips: ఆరగ్యమే మహా భాగ్యం అనే సామేత వినే ఉంటారు. ఈ మాటను పెద్దలు ఊరికే అనలేదు. ఎందుకంటే.. ఆరోగ్యంగా ఉంటేనే మనిషి పూర్తి సంతోషంగా ఉన్నట్లు. చాలా మందికి కూర్చుని తిన్నా తరగనంత డబ్బు ఉన్నా.. అనారోగ్యం కారణంగా ఏ పని చేద్దామన్నా బయపడాల్సి వస్తుంది. ఇంకా చెప్పాలంటే.. రోగాల వల్ల కనీసం ఇష్టమైన ఆహారం కూడా తినలేకపోతుంటారు. అందుకే ఆరోగ్యంగా ఉంటే.. అంతకన్నా ఐశ్వర్యం ఇంకోటి లేదని చెబుతుంటారు పెద్దలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనారోగ్యానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. అయితే అందులో కొన్ని సరైన ఔషధాలు, చికిత్స తీసుకోవడం ద్వారా తగ్గిపోతాయి. అయితే ఇంట్లో ఔషధాలను పెట్టే ప్రాంతం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. తప్పుడు ప్రాంతాల్లో ఔషధాలను (ట్యాబ్లెట్ల వంటివి) పెట్టడం ద్వారా ఆరోగ్యం మెరుగవ్వకపోగా.. నిత్యం ఏదో ఒక సమస్య వెంటాడుతుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు.


ఇంట్లో ఔషధాలు ఎక్కడ పెట్టకూడదు?


ఇంట్లో ఔషధాలను పెట్టే విషయంలో జాగ్రత్త పడాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర, పడమర దిశల్లో ఔషధాలను ఉంచొద్దని సూచిస్తున్నారు. అలా చేయడం ద్వారా ఔషధాల పనితీరు నెమ్మదిస్తుందని అంటున్నారు.


ఇక ఇంట్లో వంట గదిలో.. ప్లాట్​ఫామ్​పై మందులను పెట్టడం ద్వారా వారు నిత్యం ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుంటారని చెబుతున్నారు వాస్తు నిపుణులు.


మందులు పెట్టేందుకు ఇంట్లో సరైన ప్రాంతం ఏది?


ఇంట్లో మందులు పెట్టేందుకు ఈశాన్య మూల అత్యంత అనుకూలమైన ప్రదేశం అని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ఇక్కడ మందులతో పాటపు.. ఫస్ట్​ ఎయిడ్​ కిట్​, హెల్త్​కు సంబంధించిన వస్తువులను ఉంచడం ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారు త్వరగా కోలుకుంటారని అంటున్నారు.


(నోట్​: ఈ కథనంలోని సమాచారం నిపుణుల నుంచి సేకరించి రాయడం జరగింది. ఇందులోని విషయాలను జీ న్యూస్ తెలుగు ధృవీకరించలేదు.)


Also read: Surya Dev Pooja: ఆదివారం సూర్యదేవున్ని ఇలా ప్రార్థిస్తే అదృష్టం మీ తలుపు తడుతుంది!


Also read: Horoscope Today Feb 20 2022: రాశి ఫలాలు.. ఉద్యోగ అన్వేషణలో ఉన్న ఆ రాశివారికి ఇవాళ గుడ్ న్యూస్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook