Shukra Chadra Yuti in Karkataka Rashi 2023:  గ్రహాలు నిర్దిష్ట సమయాల్లో రాశులను మార్చడం ద్వారా వివిధ రకాల శుభ మరియు అశుభ యోగాలను సృష్టిస్తాయి. సాధారణంగా చంద్రుడు తక్కువ సమయంలో రాశిని మారుస్తాడు. జూన్ 20న చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే అదే రాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. కర్కాటకంలో వీరిద్దరి కలయిక వల్ల కళాత్మక యోగం ఏర్పడుతుంది. ఈయోగం వల్ల మూడు రాశులవారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం: చంద్రుడు మరియు శుక్రుడు కలయికతో ఏర్పడిన కళాత్మక యోగం మేషరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. మీ ఆదాయం బాగానే ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, ఇవి మీకు చాలా ప్రయోజనాలను ఇస్తాయి. ఈ సమయంలో మీరు మీ కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 
మిథునం: చంద్రుడు-శుక్రుడు కలయిక మిథునరాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీరు ఉద్యోగ-వ్యాపారాలలో లాభాలను పొందుతారు. మీ బాధ్యతలు పెరుగుతాయి. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ పాపులారిటీ పెరుగుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. మీకు కొత్త గుర్తింపు వస్తుంది. 


Also Read: Surya Grahan 2023: అక్టోబరులో చివరి సూర్యగ్రహణం.. ఈ రాశులకు కష్టకాలం.. మీరున్నారా?


వృశ్చిక రాశి: ఈ కళాత్మక యోగం వృశ్చిక రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఆగిపోయిన పనులు త్వరగా పూర్తి చేస్తారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. పాత పెట్టుబడుల ద్వారా లాభాలను పొందుతారు. 


Also Read: Guru Chandal Dosh: మరికొన్ని రోజుల్లో తొలగిపోనున్న గురు చండాల దోషం.. ఈ 5 రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్... 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook