Venus and Moon Conjunction in Kumb Rashi 2024: పంచాంగం ప్రకారం, ఈరోజు(మార్చి 9, 2024) శుక్ర గ్రహం రాశిలో పెను మార్పు సంభవించబోతుంది. శుక్రుడు ప్రస్తుతం ఉన్న రాశిని విడిచిపెట్టి శనిదేవుడి రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడిని డబ్బు మరియు లగ్జరీ లైఫ్ ను ఇచ్చే దేవుడిగా భావిస్తారు. రీసెంట్ గా చంద్రుడు కూడా కుంభరాశిలోకి వెళ్లాడు. దీంతో ఆ రాశిలో శుక్రుడు మరియు చంద్రుడు కలయిక జరిగింది. వీరిద్దరి సంయోగం కారణంగా కొందరి జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్యా రాశి
చంద్రుడు సంచారం వల్ల కన్యారాశి వారికి ఊహించనంత డబ్బు వస్తుంది. మీరు కోరుకున్న వ్యక్తే జీవిత భాగస్వామిగా దొరికే అవకాసం ఉంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ వస్తుంది. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
తులరాశి
శుక్రుడి రాశి మార్పు వల్ల తులరాశి వారు ఈ రెండ్రోజుల్లో శుభవార్త వినే అవకాశం ఉంది. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. మీరు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. మీకు పూర్వీకుల ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. 
ధనస్సు రాశి
చంద్రుడు మరియు శుక్రుడు సంయోగం ధనస్సు రాశి వారి జీవితంలో పెను మార్పులు తీసుకురాబోతుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది, అది వివాహానికి దారి తీస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.  


మేష రాశి
శుక్రుడు మరియు చంద్రుడు కలయిక వల్ల మేషరాశి వారు ఈరోజు మంచి ఫలితాలను పొందబోతున్నారు. ఇక నుంచి మీ జీవితంలో అన్నీ సుఖాలే. ఉద్యోగులకు ఆగిపోయిన ప్రమోషన్ వస్తుంది. వ్యాపారంలో లాభాలతోపాటు వృద్ధి కూడా ఉంటుంది. 
మిథున రాశి
శుక్రుడు సంచారం వల్ల మిథున రాశి వారి కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీరు ఆర్థికంగా మునుపటి కంటే పటిష్టంగా ఉంటారు. 
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Mahashivratri 2024 today: మహాశివరాత్రి నాడు త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశులకు శివుడి అనుగ్రహం..


Also Read: Mahashivratri 2024: నంది కొమ్ముల మధ్యలో నుంచి శివయ్య దర్శనం.. దీని వెనుక ఉన్న ఈ రహస్యం మీకు తెలుసా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి