Shukra Gochar October 2022: సొంతరాశిలో శుక్రుడి సంచారం... ఈ రాశులకు అంతులేని ధనం..
Shukra Gochar October 2022: ఆస్ట్రాలజీలో శుక్రుడి సంచారం చాలా శుభకరమైనదిగా భావిస్తారు. శుక్రుడి యెుక్క చిన్న రాశి మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది.
Shukra Gochar October 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ రోజు (అక్టోబరు 18) శుక్రుడు తన సొంత రాశి అయిన తులరాశిలో (Venus Transit in Libra 2022) సంచరించనున్నాడు. శుక్రుడి యెుక్క ఈ రాశిమార్పు వల్ల త్రికోణ రాజయోగం ఏర్పడనుంది. ఇది మెుత్తం 12 రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపనుంది. శుక్రుడు... సంపద, లగ్జరీ లైఫ్, ఆనందం, ప్రేమకు కారకుడు. శుక్రుడి యెుక్క ఈ సంచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. దీంతో వీరు కెరీర్ లో పురోగతిని, అపారమైన ధనాన్ని పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
శుక్ర సంచారం ఈ రాశులకు శుభదాయకం
కన్యా రాశి (Virgo): శుక్రుని సంచారం వల్ల ఏర్పడిన త్రికోణ రాజయోగం కన్యా రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. వ్యాపారులు భారీ లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం ఉంది. ఏదైనా ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది.
మకరరాశి (Capricorn): శుక్రుని రాశి మార్పు తులరాశివారికి శుభఫలితాలను ఇస్తుంది. ఉద్యోగులు ఉన్నతస్థాయికి వెళతారు. నిరుద్యోగుకు ఉపాధి దొరకుతుంది. వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పెళ్లి కూడా చేసుకోవచ్చు. లక్ కలిసి వచ్చి మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.
కుంభం (Aquarius): శుక్రుని సంచారం కుంభ రాశి వారికి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. మీరు టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. విదేశాలకు సంబంధించిన పనుల ద్వారా విశేష ప్రయోజనాలను పొందుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook