Shukra Rashi Parivartan: ఆస్ట్రాలజీలో శుక్రుడిని లవ్ గురు, రొమాన్స్ కింగ్, లగ్జరీ లైఫ్ ను ఇచ్చేవాడు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు.  పంచాంగం ప్రకారం, శుక్రుడి గ్రహా సంచారాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు. శుక్రుడి యెుక్క రాశిలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై ఖచ్చితమైన ప్రభావాన్ని చూపుతుంది. హోలీ తర్వాత అంటే మార్చి 12, ఉదయం 8.13 గంటలకు శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే అదే రాశిలో దుష్ట గ్రహమైన రాహువు నివశిస్తున్నాడు. అయితే మేషంలో శుక్రుడి సంచారం ఏయే రాశులవారికి శుభఫలితాలు ఇస్తాయో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహరాశి 
శుక్రుని సంచారం వల్ల వీరికి ఉద్యోగం లభిస్తుంది. ఫ్యామిలీ సపోర్టు దక్కుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. కొత్తగా ఏదైనా పని లేదా వ్యాపారం ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. 
మీనరాశి
మీన రాశి వారికి శుక్రుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అత్తమామలతో సంబంధాలు బాగుంటాయి. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో లాభాలు ఉంటాయి. ప్రజల వైపు ఆకర్షితులవుతారు. ఎందులోనైనా ఆలోచించి పెట్టుబడి పెట్టండి. 
మిధునరాశి
శుక్రుడి రాశి మార్పు మిథున రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్తగా పెళ్లైన వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. చదువులో అద్బుతంగా రాణిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 
ధనుస్సు రాశి
శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. వివిధ మార్గాల్లో డబ్బు వస్తుంది. పాతవివాదాలు ముగుస్తాయి. మీ కాపురం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. పెళ్లికాని ప్రసాదులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. 
మేషరాశి
ఈ శుక్ర సంచారం మేషరాశిలోనే జరుగుతోంది. కాబట్టి శుక్రుడి రాశి మార్పు వీరికి మేలు చేస్తుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుండి సపోర్టు లభిస్తుంది. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది. లవ్ సక్సెస్ అవుతుంది. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో దండిగా లాభాలు ఉంటాయి. 


Also Read: Shani Gochar 2023: 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలో త్రిగ్రాహి యోగం.. ఈరాశులపై కురవనున్న డబ్బు వర్షం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook