Shukra Mangal Yuti 2024 Effect:  కొత్త సంవత్సరం ప్రారంభంలో ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు, ధైర్యాన్ని ఇచ్చే కుజుడు కలయిక జరగబోతోంది. ఈ రెండు గ్రహాలు ధనస్సు రాశిలో సంగమించబోతున్నాయి. పైగా శుక్రుడు మరియు అంగారకుడు మిత్రులు. ఈ కీలక గ్రహాల సంయోగం మెుత్తం 12 రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. శుక్రుడు-కుజుడు మైత్రి వల్ల 2024లో ఏ రాశులవారు లాభాలను పొందబోతున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహ రాశి: 
గ్రహాల సంచారం న్యూ ఇయర్ లో సింహరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. అంతేకాకుండా సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారు. మీరు మునుపటి కంటే అధిక మెుత్తంలో డబ్బును ఆదా చేస్తారు. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. 
కన్య రాశి: 
కన్యారాశి వారికి కుజుడు, శుక్రుల కలయిక చాలా మేలు చేస్తుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. పార్టనర్ షిప్ తో వ్యాపారం చేసేవారు లాభపడతారు. మీ కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తవుతాయి.  నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. 
మేష రాశి:  
ఈ రాశి వారికి శుక్రుడు-మార్స్ కలయిక అనుకూలంగా ఉండబోతోంది. 2024లో మీ ఆదాయం రాకెట్ స్పీడ్ లో పెరుగుతుంది. మీకు కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను పొందుతారు. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. 


Also Read: Lucky Zodiac Signs: సూర్యుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండే అదృష్ట రాశులు ఇవే..!


ధనుస్సు:  
గ్రహాల సంయోగం వల్ల ధనస్సు రాశి వారికి గోల్డెన్ డేస్ మెుదలుకానున్నాయి. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఆఫీసులో మీ బాస్ నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. 


Also Read: Rajyogam: తులరాశిలో అరుదైన రాజయోగం.. డిసెంబరు 25 వరకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook