Shukra Vakri 2023 Effects:  ఆస్ట్రాలజీలో శుక్రుడిని అందం మరియు ఆనందానికి కారకుడిగా భావిస్తారు. పైగా గ్రహాలన్నింటిలోకెల్లా ప్రకాశవంతమైనది శుక్రుడు. మరో 5 రోజుల్లో అంటే జూలై 23న శుక్రుడు తన శత్రు గ్రహమైన సూర్యుడి రాశిలో తిరోగమనం చేయబోతుంది. సింహరాశిలో శుక్రుడి తిరగోమనం నాలుగు రాశులవారిని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఆ దురదృష్ట రాశులు ఏవో తెలుసుకోండి.  అంతేకాకుండా దీని అశుభ ప్రభావాలను నివారించడానికి పరిహారాలేంటో తెలుసుకోండి. 
మేషరాశి
శుక్రుడి తిరోగమనం వల్ల మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవల్సి రావచ్చు. మీ ఆదాయంతో పోలిస్తే మీ ఖర్చులు పెరుగుతాయి. మీరు అవసరం కోసం రుణం తీసుకోవాల్సి రావచ్చు. వ్యాపారవేత్తలకు ఈ సమయం అనుకూలంగా ఉండదు, ఇది మీకు హాని కలిగించవచ్చు. మీరు బిజినెస్ లో భారీగా నష్టాలను పొందుతారు. పరిహారం కోసం ప్రతి శుక్రవారం శుక్ర గ్రహానికి హవన-యాగం చేయండి. 
కర్కాటకం
శుక్ర గ్రహం రివర్స్ కదలిక వల్ల మీరు కుటుంబ సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. పెరుగుతున్న కుటుంబ అవసరాలను తీర్చడంలో మీరు అసమర్థులుగా మిగులుతారు. మీరు రుణం తీసుకునే అవకాశం ఉంది. మీరు ఎంత గొప్ప పనిచేసిన్పటికీ ప్రశంసలు లభించవు. మీరు వ్యాపారంలో నష్టపోవాల్సి రావచ్చు. మీ లైఫ్ పార్టనర్ తో విభేదాలు తలెత్తవచ్చు. దీనికి పరిహారంగా మీరు ప్రతి మంగళవారం హవనాన్ని చేయండి. అంతేకాకుండా దుర్గామాతను స్తుతించండి. 
కన్య రాశి
శుక్రుడు వ్యతిరేక కదలిక మీకు ఇబ్బందులను కలిగిస్తుంది. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. మీ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో బయట పుడ్ తినడం మానుకోండి. మీ ఇంట్లో అనుకూల వాతావరణం ఉండదు. అంతేకాకుండా పెట్టుబడి పెట్టడం మానుకోండి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ప్రతి మంగళవారం యజ్ఞం-హవనం చేయాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Mangal Shukra Yuti 2023: సింహరాశిలో కుజుడు-శుక్ర కూటమి.. ఈ 3 రాశులకు పట్టనున్న అదృష్టం..


వృశ్చికరాశి
శుక్రుడి దిశ మారడం వల్ల మీరు కెరీర్ లో చాలా సమస్యలను ఎదుర్కోంటారు. మీ ఉద్యోగంలో ఆకస్మిక బదిలీ ఉండే అవకాశం ఉంది. సడన్ గా మీ ఖర్చులు పెరుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. తల్లిదండ్రులతో ఏదో విషయంలో వాగ్వాదం రావచ్చు. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఉండదు. 


Also Read: Surya Gochar 2023: కర్కాటక రాశిలో సూర్య సంచారం.. ఈ 4 రాశులవారు దరిద్రులవ్వడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook