Venus Planet Transit In Kumbh: వేద జ్యోతిషశాస్త్రంలో శుక్ర గ్రహం సంపద, ఐశ్వర్యం, వైభవం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా భావిస్తారు. శుక్రుని గమనంలోని మార్పు ప్రజలందరిపై ఉంటుంది. జనవరి 22న శుక్రగ్రహం కుంభరాశిలోకి (Venus transit in Aquarius 2023) ప్రవేశించనుంది. దీని వల్ల మూడు రాశులవారికి శుక్రుడి ఆశీస్సులు లభించనున్నాయి. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహ రాశి (Leo): శుక్రుని సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు మీ జాతకంలో ఏడో ఇంట్లో సంచరించబోతున్నాడు. పార్టనర్ షిప్ తో చేసే బిజినెస్ లో మీరు విజయం సాధిస్తారు. మీ మానసిక సమస్యలతోపాటు ఆర్థిక సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. మీ జీవిత భాగస్వామి యెుక్క సపోర్టు మీకు లభిస్తుంది. ఈ సమయంలో మీరు మణి రాయిని ధరించడం వల్ల మేలు జరుగుతుంది. అంతేకాకుండా మీ అదృష్టం ప్రకాశిస్తుంది. 


మకర రాశిచక్రం (Capricorn): శుక్రుడు సంచరించిన వెంటనే మీ మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఎందుకంటే శుక్ర గ్రహం మీ రాశి నుండి మరొక ప్రదేశానికి బదిలీ కానుంది. అందువల్ల ఈ సమయంలో మీ ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి కోరిక నెరవేరుతుంది. ఈ సమయంలో మీరు నీలిరంగు రత్నాన్ని ధరించడం అదృష్టమనే చెప్పాలి. 


మేష రాశిచక్రం (Aries): శుక్రుడి రాశి మార్పు ఆర్థికంగా మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు మీ రాశి నుండి 11వ ఇంట్లో సంచరించబోతున్నాడు. మీరు అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. పెట్టుబడి పరంగా ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. షేర్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో పెట్టుబడి పెట్టేవారు మంచి లాభాలను గడిస్తారు. ఆర్థికంగా మీరు బలపడతారు. 


Also Read: Budh Gochar 2023: జనవరి 13న ఉదయించబోతున్న బుధదేవుడు.. ఈ 3 రాశుల వారికి కష్టాలే కష్టాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U      


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.