Venus Planet Transit In Meen: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాలు గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. సంపద మరియు కీర్తిని ఇచ్చే శుక్రుడు మీనరాశిలో సంచరించనున్నాడు. ఆ రాశిలో వీనస్ ఉచ్చ స్థితిలో ఉంటాడు. మీనరాశిలో శుక్రుడి సంచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్య రాశిచక్రం
శుక్రుని సంచారం కన్యారాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంచారం మీ రాశి నుండి ఏడవ ఇంట్లో జరగబోతోంది. మీ లైఫ్ పార్టనర్ సహకారంతో మీరు భారీగా డబ్బును పొందుతారు. వైవాహిక బంధం గట్టిపడుతుంది. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు పదవిని పొందుతారు. మీరు అనుకోకుండా ధనాన్ని పొందుతారు. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. 
వృషభ రాశి
శుక్రుడి రాశి మార్పు వృషభ రాశి వారికి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే శుక్రుడు మీ రాశి యెుక్క ఆదాయ గృహంలో సంచరిస్తాడు. దీంతో మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీ ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. వ్యాపారులు పెద్ద పెద్ద డీల్స్ ను కుదుర్చుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునే ఇదే మంచి సమయం. 
కుంభ రాశి
శుక్రుని రాశి మార్పు మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ రాశి నుండి సంపదల ఇంట్లో సంచరించబోతోంది. దీంతో మీరు ప్రమాదవశాత్తు ధనలాభాన్ని పొందుతారు. బిజినెస్ క్లాస్ పీపుల్‌కి కూడా టైమ్ బాగానే ఉంటుంది. మీరు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందుతారు. మీరు మీ మాటలతో ప్రజల హృదయాలను గెలుచుకుంటారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది.


Also Read: Surya Gochar 2023: 30 ఏళ్ల తర్వాత కుంభంలో శని, సూర్యుని కలయిక.. ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook