Shukra Vakri 2023 in Karkataka Rashi: లవ్, రొమాన్స్, ఐశ్వర్యం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. వచ్చే నెల 22న శుక్రుడు తిరోగమనం చేయబోతున్నాడు. కర్కాటక రాశిలో శుక్రుని వ్యతిరేక కదలిక ప్రజల జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. తిరోగమన శుక్రుడు మూడు రాశులవారికి భారీగా లాభాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రుడు తిరోగమనం ఈ 3 రాశులకు వరం
మేషం: తిరోగమన శుక్రుడు మేష రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తాడు. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాభపడతారు. రియల్ ఎస్టేట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం ప్రత్యేకంగా ఉండబోతుంది. ప్రేమికుల మధ్య బంధం గట్టిపడుతుంది. 


మిథునం: శుక్రుని తిరోగమనం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారస్తులు పెద్ద డీల్ కుదర్చుకునే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 


Also read: July Grah Gochar 2023: జూలై 01 నుండి ఈ 4 రాశులకు డబ్బే డబ్బు... లాభాలే లాభాలు.. మీది ఉందా?


తుల రాశి: తులారాశికి అధిపతిగా శుక్రుడిని భావిస్తారు. మీరు కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగ-వ్యాపారాలలో మంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు కోరుకున్న చోటుకి ట్రాన్సఫర్ అవుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ ధనలాభం పెరుగుతుంది. 


Also Read: Rahu Ketu Nakshtra Transit 2023: రాహు-కేతు నక్షత్ర మార్పుతో ఈ రాశులకు మంచి రోజులు.. మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook