Venus Transit In Cancer On August 7 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి గ్రహం నిర్దిష్ట కాలం తర్వాత తన రాశిని మారుస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రంమలోనే 2022 ఆగస్ట్ 7 ఉదయం 5:21 గంటలకు సంపద, కీర్తికి అధిపతి అయిన శుక్ర గ్రహం జెమిని నుంచి కర్కాటకంలోకి ప్రవేశిస్తుంది. శుక్రుడు ఆగస్టు 31 వరకు ర్కాటక రాశిలోనే ఉంటాడు. ఈ మార్పు అన్ని రాశి చక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది. శుక్రుడి మార్పు ప్రభావం ఏ ఏ రాశులపై ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం:
వ్యవసాయం మరియు విద్యా రంగంలో ఉన్న వారికి పోరాటం తప్పదు. ఆదాయం మరియు డబ్బు విషయంలో అడ్డంకులు తప్పవు. ఎప్పుడూ టెన్షన్ పడతారు. విదేశాలకు వెళ్లడం లేదా దూర ప్రయాణాలు వాయిదా పడొచ్చు. ఆగష్టు 20 నుంచి ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగవుతుంది. 


వృషభం:
సమాజంలో గౌరవం, కీర్తి పెరుగుతుంది. ఉద్యోగంలో విజయం పొందుతారు. కుటుంబం నుంచి సహకారం లభిస్తుంది. ఆగస్టు 10 నుంచి 20 వరకు ఆదాయపు ఆటంకం ఏర్పడుతుంది. కళారంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు శుభ ఫలితాలను పొందుతారు.


మిథునం:
ఉద్యోగం, వ్యాపారం, వివాహ విషయాల్లో అడ్డంకి ఉంటుంది. ఆగష్టు 20 తర్వాత అన్ని సర్దుకుంటాయి. చదువులో పిల్లల పనితీరు బాగుంటుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.


కర్కాటకం:
ఐటీ రంగంలోని వారికి శుభప్రదం. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మహిళా సహోద్యోగులతో వివాదాలు పెట్టుకోవద్దు. వైవాహిక జీవితంలో ఆటంకాలు ఎదురవుతాయి. 


సింహం:
ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తికావు. సోదరులతో మనస్పర్థలు రావచ్చు. ఆరోగ్యం విషయంలో గర్భిణులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఉన్నత అధికారితో గొడవపడితే ఉద్యోగం పోయే అవకాశం ఉంది. ఆగస్ట్ 20 తర్వాత మార్పు ఉంటుంది.


కన్య:
వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో వివాదాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పిల్లల విషయంలో ఆందోళన పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వ్యాపారంలో పురోగతి ఉంటుంది.


తుల:
ఉద్యోగం మరియు ఆదాయానికి అడ్డంకులు ఏర్పడుతాయి. ఆరోగ్యం ప్రతికూలంగా ఉంటుంది. కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఉంది. స్థిరాస్తి సంబంధిత పనులలో ఆటంకాలు ఎదురవోచ్చు. 


వృశ్చికం: 
అదృష్టం నెమ్మదిగా పెరుగుతుంది. కుటుంబం నుంచి సహకారం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. ఆగష్టు 9 నుంచి 10 వరకు ఆటంకాలు ఏర్పడతాయి. అన్నదమ్ములతో విభేదాలు ఉండవచ్చు. 


ధనుస్సు :
ఉద్యోగంలో సమస్యలు తలెత్తుతాయి. ఆదాయానికి ఆటంకం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు వారి భాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆగష్టు 17 తర్వాత వ్యాపారంలో పురోగతి ఉంటుంది.


మకరం:
భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆగస్టు 20 తర్వాత విద్యార్థులకు చదువులో మంచి పనితీరు ఉంటుంది. డబ్బు ఆలస్యంగా చేతికి వస్తుంది.


మీనం:
శుభవార్తలను వింటారు. సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులు విజయం పొందుతారు. పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం. స్త్రీలను గౌరవించాలి. వైవాహిక జీవితం కాస్త ఆహ్లాదకరంగా ఉంటుంది.


Also Read: కంటెంట్‌ బాగుంటే.. ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు! చిరంజీవి ట్వీట్ వైరల్


Also Read: లైగర్‌ నుంచి రొమాంటిక్‌ సాంగ్‌.. విజ‌య్‌ దేవరకొండ, అన‌న్య పాండే కెమిస్ట్రీ అదుర్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook