COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Venus Transit 2023: శుక్రుడి సంచారం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్రుడు త్వరలోనే రాశి సంచారం చేయబోతోంది. ఈ గ్రహం జాతకంలో బలంగా ఉంటేనే వ్యక్తి గత జీవితంలో ఆర్థిక ప్రయోజనాలతో పాటు ప్రేమ జీవితంలో ఆనందం పొందుతారు. డిసెంబర్ 25న ఉదయం 6:33 గంటలకు శుక్రుడు వృశ్చికరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. జనవరి 18 వరకు శుక్రుడు అదే రాశిలో ఉండబోతున్నాడు. ఆ తర్వాత 2024 సంవత్సరంలోని  జనవరి 18న ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్ర గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. 


3 రాశుల వారికి 2024లో అదృష్టం వరించబోతోంది:
తులారాశి:

తుల రాశి వారికి శుక్ర గ్రహం రాశి సంచారం చేయడం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ప్రేమ, పెళ్లి కోసం చూస్తున్న ఒంటరి వ్యక్తులు శుభవార్త పొందుతారు. ఈ సమయం ఉద్యోగస్తులకు, వ్యాపారులకు అదృష్టం కలిసి వస్తుంది. అయితే ఈ సమయంలో వివాహితులు తమ భాగస్వామి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.


మేషరాశి: 
మేష రాశి వారికి శుక్రుడి సంచారం కారణంగా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్న వారు కార్యాలయంలో కొత్త అవకాశాలను పొందుతారు. కష్టపడి పనులు చేసేవారికి ఈ సమయం చాలా ఫలప్రదంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి, సంతోష వాతావరణం నెలకొంటుంది. మీ జీవిత భాగస్వామితో కొన్ని విబేధాలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి ఓపికతో సమస్యలను పరిష్కరించుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి శుక్రుని సంచారం ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల అనుకున్న లాభాలు పొందుతారు. దీంతో పాటు కొంతమంది భూములు కొనుగోలు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందకరమైన సమయాన్ని కూడా గడుపుతారు.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి