హిందూ జ్యోతిష్యం ప్రకారం శుక్రగ్రహం రాశి పరివర్తనం ప్రభావం కొన్ని రాశులపై అత్యంత శుభసూచకంగా ఉండనుంది. కొత్త ఏడాది ప్రారంభంలో శుక్రుడి రాశి పరివర్తనం ప్రభావంతో..అంతా శుభమే జరగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రుడు ఒక రాశిలో 23 రోజులుంటాడు. శుక్రుడిని ధన విలాసాలకు, ప్రేమ, ఆకర్షణ, పెళ్లికి కారకుడిగా భావిస్తారు. శుక్ర నక్షత్రం అస్తమించిన తరువాత జరిగే పెళ్లి సఫలం కాదని నమ్మకం. అందుకే కొత్త దంపతులకు శుక్రుడి కటాక్షం తప్పనిసరి. శుక్రుడు భౌతిక సుఖాన్ని కూడా అందిస్తాడు. ఈసమయంలో శుక్రుడి ధనస్సురాశిలో ఉన్నాడు. బుధుడితో కలిసి యుతి ఏర్పాటుతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడనుంది. ఆ తరువాత శుక్రుడు మకరం కుంభం, ఫిబ్రవరి 2023లో మీనరాశిలో ప్రవేశించనున్నాడు. 2023 ఫిబ్రవరి 15న శుక్రుడి తన మీనరాశిలో గోచారం కారణంగా రాజయోగం ఏర్పడుతుంది. ఫలితంగా 3 రాశులవారు డబ్బులతో తులతూగుతారు. 


మిధున రాశి Gemini Zodiac


మిధునరాశి వారికి సంపాదన రాజయోగం కారణంగా కెరీర్ పైకి వెళ్తుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో పెద్ద డీల్స్ సాధిస్తారు. మీ పనిని అందరూ ప్రశంసిస్తారు. సీనియర్లు సంతోషంగా ఉంటారు. పదోన్నతి, ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. పెళ్లికానివారికి పెళ్లి యోగం ఉంటుంది. వివాహితుల జీవితంలో ఎదురయ్యే సమస్యలు దూరమౌతాయి.


కన్యారాశి Virgo Zodiac


కన్యారాశి జాతకులకు శుక్రగోచారం కారణంగా ప్రేమ జీవితం, వైవాహిక జీవితంలో సుఖం లభిస్తుంది. రిలేషన్‌షిప్‌లో ఉన్నవారి జీవితంలో ప్రేమ పెరుగుతుంది.  భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తే లాభాలు ఆర్జిస్తారు. విదేశీ యాత్రకు వెళ్తారు. జీవితంలో పూర్తిగా ఆనందం పొందుతారు. కుటుంబ జీవితం, వృత్తిపరమైన జీవితం రెండింట్లోనూ హాయిగా ఉంటారు.


ధనస్సు రాశి Sagittarius Zodiac


శుక్రుడి రాశి పరివర్తనం కారణంగా ఏర్పడే రాజయోగంతో ధనస్సు రాశివారి జీవితంలో గోల్డెన్ డేస్ అని చెప్పవచ్చు. శుక్రుడి కటాక్షంతో జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. కొత్త ఇళ్లు వాహనం కొనుగోలు చేయవచ్చు. ఆస్థులతో లాభాలు కలుగుతాయి. కొత్త ఉద్యోగ అవకాశం లభిస్తుంది. పదోన్నతి, ఇంక్రిమెంట్ ఉంటుంది. తల్లిదండ్రుల్నించి సహయోగం లభిస్తుంది. 


Also read: Saturn 2023: శని గోచారం ప్రభావం, జనవరి 17, 2023 నుంచి ఆ రెండు రాశులకు పెను కష్టాలు తప్పవు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook